కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించి ఇప్పటికి కొన్ని లక్షలమందిని బలి చేసింది. ఇంకా అలాంటి కరోనా వైరస్ ని మన దేశంలో నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ చివరికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది. 

 

IHG

 

రోజు రోజుకు కరోనా వైరస్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ అంతం అవ్వాలి అంటే హెర్బల్ టీ తాగాలి అని, ఆలివ్ నూనె వాడాలి అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అలానే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఏంటి అంటే? మట్టి పాత్రల్లో భోజనం చేస్తే కరోనా వైరస్ రాదూ అని ప్రచారం జరుగుతుంది. 

 

IHG

 

మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి అని.. అందుకే మట్టి కుండల్లో వంట చేయడం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

 

IHG

 

అంతేకాదు మట్టి కుండలో వండిన ఆహారంలో నూనె శాతం తక్కువుగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అని. రోగనిరోధక శక్తి ఉండడం వల్ల.. మట్టికుండల్లో భోజనం చేసి.. మట్టి పాత్రల్లో భోజనం తినే వారికీ కరోనా వైరస్ అసలు రాదూ అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: