ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని ఎదుర్కోవటానికి అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకానొక టైములో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు డబ్బు ఉన్న దేశాలు అని చెప్పుకునే దేశాలు కరోనా వైరస్ ఎఫెక్ట్ కి చాలావరకు డ్యామేజ్ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా వైరస్ ప్రభావం రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఏకంగా రోజుకి 15 వేలకు మించి కొత్త పాజిటివ్ కేసులు బయటపడటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్రంలో మరియు వైద్యుల లో ఆందోళన ఉన్న కొద్ది తీవ్రతరం అవుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలావరకు కరోనా వైరస్ కట్టడి చేయడం వైయస్ జగన్ తీసుకుంటున్న కృషి ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ గా మారుతుంది. కరోనా వైరస్ కట్టడి చేయటానికి ఎప్పటికప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలు అదరహో అని ఏకంగా బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కొనియాడారు.

 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ సిస్టం  చాలా అద్భుతమైన, ఇలాంటి తరహా వాలంటరీ సిస్టం బ్రిటన్ లో కూడా పెట్టాలని ఇక్కడి నాయకులు ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం అసలు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆరా తీశారట. ఈ సందర్భంగా బ్రిటన్ దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ఏపీ ప్రభుత్వం సలహాలు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారట. దేశం మొత్తంలో ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు ఏపీలో జరుగుతుంటే, మిగతా రాష్ట్రాలలో తక్కువ నిర్ధారణ పరీక్షలు జరగడంతో అక్కడ ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

 

దీంతో క్యారియర్స్ ఎక్కువవడంతో వైరస్ చైన్ కట్ చేయడానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అదేవిధంగా ఒడిస్సా సీఎం జాతీయ మీడియా ప్రశంసలు కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో వైఎస్ జగన్ కరోనా వైరస్ నీ ఎదుర్కొంటున్న నిర్ణయాలు హైలెట్ అవ్వటం తో ఈ వార్త జాతీయ మీడియాలో కూడా వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: