నెక్స్ట్ ఎవరు.. నెక్స్ట్ ఎవరు అనే ఉత్కంఠ తెలుగుదేశం పార్టీతో పాటు, ప్రజలలోనూ    ఎక్కువయిపోతోంది. అనేక ఫిర్యాదులు, అనేక అవినీతి, అక్రమాలు ఇలా ఎన్నో విషయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డంగా ప్రభుత్వం చేతికి చిక్కుతున్నారు. ఒక్కొక్కరిని జైలుకు పంపించే  విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టిపెట్టినట్లు గా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే టిడిపి నాయకుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు కాగా, ఆ తర్వాత అనంతపురం జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టయ్యారు. ఇక ఆ తరువాత విశాఖ జిల్లా కీలక నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక మహిళా అధికారిని దూషించిన కేసులో ఆరోపణలు ఎదుర్కోవదమే కాకుండా ఈ వ్యవహారంపై సాక్షాలు బలంగా ఉండడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 


ఆయనపై నిర్భయ చట్టం , లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదు కావడంతో ఆయన మరికొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి, విశాఖ జిల్లా నాయకుడు గంటా శ్రీనివాస రావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనను అయ్యన్నపాత్రుడు కంటే ముందుగానే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ,మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మరో మహిళా నాయకురాలిపై వివాదాస్పద పోస్టులు పెట్టిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు నందకిషోర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో గంటా శ్రీనివాసరావు పాత్ర ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. 

 


ఈ నేపథ్యంలో త్వరలోనే గంటాకు అరెస్టు తప్పదనే ప్రచారం జోరందుకుంది. అదీ కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సిఐడి అన్ని ఆధారాలు సేకరించినట్టు  సమాచారం. ఇప్పటికే గంటా అరెస్టు తప్పదన్న సంకేతాలు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: