ప్రతిపక్షం అన్నాక విమర్శలు సహజమే. కానీ ఏ విషయంలో విమర్శలు చేయాలి అన్న విచక్షణ ఉంటుంది. కానీ.. తెలుగు దేశం రాజకీయాల‌లో ఆ విచక్షణ మాయమవుతోంది. తెలుగు దేశం ఎమ్మెల్సీకి ముందు టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చిందని.. మళ్లీ హైదరాబాద్ లో టెస్టు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తెలుగు దేశం ఆరోపించింది. కరోనా పరీక్షల్లో కూడా ఈ ప్రభుత్వం ఫెయిలైందని మండిపడింది.

 

 

అయితే అసలు విషయం ఏంటంటే.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా టెస్ట్ ఫలితాల విషయంలో తెదేపా నేత లోకేశ్ చేసిన ఆరోపణలో పసలేదని వైద్యారోగ్యశాఖ తేల్చి చెప్పింది. కరోనా టెస్టుల అంశంపై నిలదీస్తూ ఆయన చేసిన ఆరోపణ బాధ్యతారాహిత్యమంటూ ప్రకటన విడుదల చేసింది. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్న వైద్యారోగ్యశాఖ ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో కచ్చితత్వం 67 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది.

 

 

ఓ వ్యక్తి శరీరంలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నా నెగెటివ్ గా చూపుతాయని వెల్లడించింది. ఇన్ ఫెక్టెడ్ వ్యక్తిలో వైరస్ 100 శాతం ఉంటే ఫలితం పాజిటివ్ గా వస్తుందని తెలిపింది. అంటే.. కరోనా పాజిటివ్ గా నిర్ధరణైతే వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్టేనన్నమాట. ఎవరైనా ఇన్ ఫెక్టెడ్ రోగి చికిత్స చివరిదశలో ఉన్నా నెగెటివ్ గా రావొచ్చని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

 

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి తొలి ఫలితాలు పాజిటివ్ వస్తే వందశాతం ఇన్ఫెక్షన్ కు గురైనట్టేని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రెండో విడత పరీక్షలో నెగిటివ్ రావడానికి ఆయనలో ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం లోపుగా ఉండటమే కారణమని వెల్లడించింది. సాంకేతిక అంశాలపై స్పందించే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ వైద్యారోగ్యశాఖ చురకలు వేసింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం సరికాదని కామెంట్ చేసింది. ఏంటి బాబూ.. ఇది. మీ రాజకీయాలకు చివరకు కరోనా పరీక్షలనూ వదలరా అంటున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: