వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలు చేసే నాటినుండి ఆంధ్రజ్యోతి మరియు ఈనాడు పత్రికలు ఆయనకు వ్యతిరేకంగానే వార్తలు మరియు కథనాలు వాడి వరిస్తాయని ఏపీ పాలిటిక్స్ లో ఎప్పటి నుండో ఉన్న టాక్. వైఎస్ చనిపోయాక కూడా ఎప్పుడైతే జగన్ రాజకీయంగా ఎదుగుతున్నాడు అన్న టైములో ఈ రెండు పత్రికలు జగన్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వైయస్ మాదిరిగానే వైయస్ జగన్  కూడా ఎప్పటికప్పుడు ఈ రెండు పత్రికలను ఖండిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ రెండు పత్రికలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయని ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ విమర్శలు చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో మరియు మీడియా సమావేశాలలో ఈ రెండు పత్రికలు తెలుగుదేశం పాంప్లెట్ కూడా జగన్ ప్రస్తావించటం చాలాసార్లు విన్నాం.

 

కాగా తెలుగు పత్రికా రంగంలో మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ రెండు పత్రికలు ఏపీ రాజకీయాలను కుదిపేసిన పార్క్ హయత్ హోటల్ నిమ్మగడ్డ వీడియో గురించి ఇప్పటి వరకు సరైన కథనాలు ఈ రెండు పత్రికల లో  రాకపోవటం తో ఏపీ జనాలు ఈ రెండు పత్రికల పై దుమ్మెత్తి పోస్తున్నారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ మరియు నిమ్మగడ్డ కలిసి పార్క్ హయత్ హోటల్లో హైదరాబాద్ నగరంలో సమావేశం అవ్వడం దానికి సంబంధించిన వీడియో రిలీజ్ అవ్వడంతో ఈ విషయం చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా లో అదేవిధంగా సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కధనాలు వస్తున్నాయి.

 

టీవీల్లో డిబేట్ లు నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన ఒక్క కథనం కూడా ఈ రెండు పత్రికలు ప్రచురించకా పోవడంపై ఏపీ జనాలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం ఉన్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉందని ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్న తరుణంలో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు… ఈ విషయాన్ని ప్రచురించాక పోవడంపై నిమ్మగడ్డ ఎఫెక్ట్ వల్ల రెండు పేపర్లపై ఏపీ జనాలు మండిపడుతున్నారు. జగన్ అన్నట్టుగానే ఈ రెండు పత్రికలు టీడీపీ పాంప్లెట్లు అంటూ అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: