హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అన్ లాక్ 1.0 సడలింపులు అమలవుతున్న రోజు నుంచి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ప్రతిరోజూ 700కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్నా ప్రజలు మాత్రం నిబంధనలను లెక్క చేయడం లేదు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. నగరంలోని పలు ఏరియాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్ జోన్ లోని కార్వాన్ లో 662, గోషామహల్ లో 497, మెహిదీపట్నంలో 475, జూబ్లీహిల్స్ లో 369, ఖైరతాబాద్ లో 351 కేసులు నమోదయ్యాయి. 
 
సికింద్రాబాద్ జోన్ లోని అంబర్ పేట్ లో 335, సికింద్రాబాద్ లో 304, బేగంపేట్ లో 256, ముషీరాబాద్ లో 174, మల్కాజ్ గిరిలో 165 మందికి కరోనా నిర్ధారణ అయింది. చార్మినార్ జోన్ లోని మలక్ పేట్ లో 302, ఫలక్ నామలో 285, చార్మినార్ లో 256, ఛంద్రయాణగుట్టలో 251, సంతోష్ నగర్ లో 163 కేసులు నమోదయ్యాయి. ఎల్బీ నగర్ జోన్ లోని సరూర్ నగర్ లో 140, ఎల్బీ నగర్ లో 104, కాప్రాలో 62, ఉప్పల్ లో 32, హయత్ నగర్ లో 45 మంది కరోనా భారీన పడ్డారు. 
 
శేరిలింగంపల్లి జోన్ లోని శేరిలింగంపల్లిలో 152 కేసులు, పఠాన్ చెరులో 104, రామచంద్రాపురంలో 72 కేసులు, యూసఫ్ గూడలో 70 కేసులు నమోదయ్యాయి. కూకట్ పల్లి జోన్ లోని అల్వాల్ లో 71 మంది, మూసాపేటలో 61 మంది, గాజులరామారంలో 49 మంది, కూకట్ పల్లిలో 33 మంది, కుత్బుల్లాపూర్ లో 43 మంది వైరస్ భారీన పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: