తెలంగాణలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో 920 మంది క రోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. వీరిలో 4,688 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 6,446 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నిన్న నమోదైన కొత్త కేసుల్లో 737 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌‌లో 60, కరీంనగర్‌‌లో 13, సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మూడేసి, ములుగు, వరంగల్‌ అర్బన్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి, వరంగల్‌ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.  

 

దీంతో నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాలు కూడా హైరానా చెందుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా షాపులు తెరవకూడదని నిర్ణయించారు.  కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

కాగా, నేడు తెలంగానలో 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయిఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ వెల్లడించారు.  జీహెచ్ఎంసీ పరిధిలోనే 737 కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స పొందుతూ నేడు ఐదుగురు మృతిచెందారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 11 వేలు దాటడంతో అందరికి భయం పట్టుకుంది.  ఇక లాక్ డౌన్ ఉన్న సందర్భంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కేసులు పెద్దగా పెరగలేదు.. కానీ లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు పెరిగిపోతున్నాయన్న భయం పట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: