చైనా ఇపుడు అందరికీ శత్రువే. అయినా దాని పొగరు తెంపరితనం ఎక్కడా తగ్గకపోవడమే విశేషం. ఓ వైపు కరోనా వైరస్ అంటించిన దేశంగా ప్రపంచం అంతా చీ కొడుతున్న  వేళ బుద్ధున్న మరే దేశం కూడా ఇలా బరితెగించదు. సరిహద్దు గొడవలకు తెగబడదు, చేసిన తప్పుకు అవమానంతో కుమిలిపోతుంది. కానీ అక్కడ ఉన్నది చైనా కాబట్టి సిగ్గూ ఎగ్గూ లేకుండా భారత్ మీదకు దండెత్తివస్తోంది. ఓ వైపు చర్చలు అంటూ మరో వైపు దాడులు చేయడం కూడా చైనాకే చెల్లింది.

 

ఇలా గత కొన్నాళ్ళుగా భారత్ ని చిక్కుల్లో చికాకుల్లో పెడుతున్న చైనాను ఎదుర్కొనే విషయంలో భారత్ తనదైన కార్యాచరణను రూపొందించుకుంటోంది. అయితే చైనా లాంటి  మహమ్మారి పనిపట్టేందుకు దూకుడుగా వెళ్లడమే మార్గమని అంటున్నారు. సామదాన ప్రయోగాలు చైనాతో అసలు కుదరవు అని, బాగా ముదిరిపోయిన డ్రాగన్ రోగానికి మందు దెబ్బకు దెబ్బేనని కూడా అంటున్నారు.

 

ఈ నేపధ్యంలో భారత్ కి సాయం చేస్తామంటూ అమెరికా ముందుకు రావడం కీలకమైన పరిణామం. జర్మనీ నుంచి ఉప‌సంహరించుకుంటున్న బలగాల‌ నుంచి పదివేల మందిని భారత్ కు పంపిస్తాం పంపుతామని, పూర్తి స్థాయిలో  సాయం చేస్తామని ఇపుడు అమెరికా ప్రతిపాదిస్తోంది. చైనా తాట తీద్దామంటూ కొత్త ప్రతిపాదన ముందుకు తెస్తోంది.

 

సైనిక సాయానికి అమెరికా రెడీ అవుతున్న వేళ భారత్ స్పందన ఏంటో  ఇంకా తెలియలేదు కానీ సరిహద్దుల్లో చర్చలు మాత్రం పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదని భారత నాయకత్వం కూడా భావిస్తోంది. ఇపుడు అమెరికా సాయం తీసుకుంటే మాత్రం మినీ యుధ్ధమే సరిహద్దుల్లో జరిగే అవకాశమే ఉంది. అది పెరిగి పెద్దదై ఏకంగా అతి పెద్ద యుధ్ధంగా కూడా మారుతుందని అంటున్నారు.

 

మరో వైపు అమెరికా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆసియా దేశాలకు చైనా ఇక మహమ్మారిగా మారిందని అంటోంది. జపాన్ లాంటి ఇతర దేశాలు కూడా చైనాతో విసిగి ఉన్నాయి. అందరూ తలో చేయీ వేస్తే చైనా తాట తీయడం ఈజీవే. కానీ అది మూడవ ప్రపంచ యుధ్ధం వైపు దారి తీస్తుందా అన్న భయాలు కూడా అందరిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: