దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రైవేట్ పాఠశాలలు తమ తీరును మార్చుకోవడం లేదు. తెలంగాణ సర్కార్ ట్యూషన్ ఫీజులు పెంచొద్దని గతంలోనే జీవో జారీ చేసింది. అయితే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు పేర్లు మార్చి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి 
 
ఎల్.కే.జీ, యూ.కే.జీ విద్యార్థులకు సైతం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఫీజులు భారీగా పెంచటంతో రాష్ట్రంలో పలు పాఠశాలల ముందు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ధర్నాకు దిగుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటే ఉద్యోగులకు సగం జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. సీ.బీ.ఎస్.ఈ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. 
 
ప్రైవేట్ సంస్థలు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించడంతో ల్యాప్ టాప్, ట్యాబ్, ఇంటర్నెట్ కనెక్షన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు సగం పాఠశాలలు ఫీజులు పెంచినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం సగం ఫీజు చెల్లిస్తే మాత్రమే ఆన్ లైన్ తరగతులకు అనుమతిస్తామని చెబుతున్నాయి. విద్యా శాఖ దగ్గర గత ఏడాది ట్యూషన్ ఫీజుల వివరాలు లేకపోవడంతో ఏ పాఠశాలకు ఎంత ఫీజు అనే వివరాలు తెలియడం లేదు. 
 
రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు ట్యూషన్ ఫీజులకు బదులుగా యూనిఫాం, పుస్తకాల పేర్లు చెప్పి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసులకు ఒక విధానం అనేది లేకపోవడంతో పాఠశాలలు ఇష్టానుసారం క్లాసులను నిర్వహిస్తున్నాయి. యాక్టివిటీ ఫీజులు, మెస్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ఆన్ లైన్ క్లాసుల పేర్లు చెప్పి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: