కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తారు.. ఈ మద్య కొంత మంది పిల్లలు తమ సృజనాత్మతకు పదును పెడుతూ.. ఆశ్చర్య పరిచే విధంగా వస్తువులు తయారు చేస్తున్నారు. తాజాగా  కేరళాకు చెందిన ఏడో తరగతి బాలుడు న్యూస్‌ పేపర్ల‌తో తయారు చేసిన రైలు నమూనా అందరినీ అబ్బురపరుస్తోంది.  ఈ మద్య కరోనా కేసలు పెరిగిపోవడంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఇంటి వద్ద ఉన్నఅద్వైత్‌ కృష్ణ (12)  ఒక చక్కటి ఆలోచన వచ్చింది.  న్యూస్ పేపర్లతో ఓ రైల్ బండి తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.. దానికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. 

 

అద్వైత్‌ కృష్ణ (12) న్యూస్‌ పేపర్లతో‌ రైలును తయారు చేస్తు‍న్న వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసిందంటే బాలుడి ప్రతిభ రైల్వే అధికారులనూ ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత అద్భుతమైన ఆలోచన ఈ చిన్నారికి రావడం ఎంతో సంతోషం అంటున్నారు. కేరళలో త్రిస్సూర్‌లోని‌ సీఎన్‌ఎన్‌ బడిలో ఆ బాలుడు 7వ తరగతి చదువుతున్నాడని రైల్వే శాఖ తెలిపింది.

 

ఇందుకోసం 33 న్యూస్‌ పేపర్లు, 10 ఎ4 షీట్లు వినియోగించాడని తెలిపింది. పేపర్లతో‌ ఈ రైలును తయారు చేయడానికి అతడికి మూడు రోజుల సమయం పట్టిందని రైల్వే శాఖ చెప్పింది.  ఆ బాలుడి ప్రతిభకు నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా ఎంతో మంది పిల్లలు లాక్ డౌన్ సమయంలో తమ ఆలోచనలకు పదును పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: