చైనా బార్డ‌ర్లో ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో బీజేపీ స‌ర్కారును ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ పార్టీని క‌మ‌ల‌నాథులు సైతం అదే రీతిలో అటాక్ చేశారు. కేంద్రంలో ఉన్న త‌మ సర్కారును టార్గెట్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి నిధులు చైనా నుంచి అందుతున్నాయ‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఆరోపించారు. చైనా ఎంబసీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ ఫౌండేషన్‌కు నిధులు వచ్చాయని ఆయ‌న తెలిపారు.  ``2005-06 సంవత్సరంలో పొందిన ఈ నిధుల‌కు సంబంధించి సాధారణ దాతల జాబితాలోనే చేర్చారు. కానీ చైనా నుంచి తీసుకున్న ఆ విరాళాలను ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా పేర్కొనలేదు ఎందుకు? ఆ విరాళాలు తీసుకున్న తర్వాతే చైనాకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా భారత్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని రాజీవ్ ఫౌండేషన్ సిఫారసు చేసిన మాట నిజం కాదా..?' అని రవిశంకర్ ప్రసాద్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో న‌డిచిన అప్పటి యూపీఏ ప్రభుత్వం చైనా నుంచి లంచం తీసుకుందా? నిల‌దీశారు. 2008లో చైనాతో కాంగ్రెస్ రహస్యం ఒప్పందం చేసుకుందని బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఆరోపించారు. అప్పట్లో చైనా ఎంబసీ అధికారులతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమావేశం అయ్యారని ఆయ‌న వెల్ల‌డించారు.

 


ఇదిలాఉండ‌గా, ఎమ‌ర్జెన్సీపైనా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. రాయ్‌బ‌రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్ల‌దని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఇందిరాగాంధీ అమానుష‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని, 1975, జూన్ 25 దేశ చరిత్ర‌లో ఒక దుర్దిన‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం 1975, జూన్ 25న దుర్మార్గ‌పూరిత నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి అరాచ‌క పాల‌న సాగించార‌ని చెప్పారు. రాయ్‌బ‌రేలీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్ల‌దని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఇందిరాగాంధీ అమానుష‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ గుర్తుచేశారు.

 


ఇందిరాగాంధీ అల‌హాబాద్ హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించార‌ని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పును పెండింగ్‌లో పెట్టి, ఇందిరాగాంధీ ప్ర‌ధానిగా కొన‌సాగడానికి అవ‌కాశం ఇచ్చింది. దీంతో జ‌న‌తాపార్టీకి చెందిన జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్‌, మొరార్జీదేశాయ్‌లు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో దేశం మొత్తం ఆందోళ‌న‌లు వెల్లువెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: