దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి.. దాంతో మార్చి 24 నుంచి లాాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి అన్ని వ్యవస్థలు మూసివేశారు. కేవలం అత్యవసర వస్తువుల విక్రయాలకు మాత్రమే పరిమిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసందోహంగా ఉండే దేవాలయాలు కూడా మూసివేశారు. ఇక తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం ఈ మద్య కలుగుతుంది.  లాక్ డౌన్ సడలించిన తర్వాత దేవాలయాలు పునఃప్రారంభానికి ఓకే చెప్పారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపు తరువాత రోజుకు 6 వేల మంది వరకూ దర్శనాలు కల్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, దర్శనాల సంఖ్యను పెంచారు. 

 

భక్తులంతా భౌతిక దూరం  నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు తల పట్టుకోవాల్సి వచ్చింది. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ, అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్స్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ ఉదయం టికెట్లను జారీ చేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. 

 

అయితే ఈ నెల  30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ కోటా టికెట్ల పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏపిలో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోతున్న సందర్భంలో ఇక్కడ అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం వెంకన్న దర్శనం కోసం వేల మంది భక్తులు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: