కర్ణాటక హైకోర్టు జడ్జి కృష్ణ దీక్షిత్…. రాకేష్ అనే ఒక రేప్ కేసు లో ముద్దాయిని చాలా అనూహ్యంగా యాంటిసిపేటరీ బెయిల్ మీద పోలీసు కస్టడీ నుండి బయటకు పంపడం జరిగింది. లక్ష రూపాయల పూచీ కత్తుతో ఇద్దరు షూరిటీ లతో అతనికి బెయిల్ మంజూరు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

 

సాధారణంగా నిర్భయ కేసులో ముద్దాయికి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో లభించదు. ఎవరైనా ఒక ముద్దాయి అమ్మాయిని బలవంతం చేస్తే…. అతను ఖచ్చితంగా జైలు పాలు కావడమో లేదా ఉరి తీయబడడమో జరుగుతుంది. అంతటి బలమైన నిర్భయ కేసులో ఇప్పుడు ఇతనికి బెయిల్ రావడం అనేది ఒక సంచలనం అనే చెప్పాలి.

 

ఇక దీనంతటికీ కారణం... బాధితురాలు చెప్పిన కథలో చాలా లోపాలు ఉండడమే. సదరు బాధితురాలు ఎవరైతే తనను బలవంతం చేశారని చెప్తుందో…. రాకేష్ యొక్క ఆఫీస్ కి రోజు రాత్రి 11 గంటలకు వెళ్ళింది. అంతే కాకుండా అతనితో కలిసి మద్యం సేవించింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె కు రేప్ కి గురి అయిన తర్వాత కూడా ఇంటికి లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్లకపోగా రాత్రంతా అదే ఆఫీసులో పడుకుంది.

 

ఇక జడ్జి…. అమ్మాయిని అంత రాత్రి వేళ.... అతని ఆఫీస్ కి ఎందుకు వెళ్లావు అని అడగగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా వారు మద్యం సేవించాలని ఆహ్వానించినప్పుడు ఆమె కాదు అనకుండా స్వాగతించడం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జడ్జి మాట్లాడుతూ "భారత స్త్రీలు ఎవరు రేప్ కి గురి అయిన తర్వాత…. అక్కడే తెల్లవారుజామున వరకు నిద్రపోయి వెళ్ళరు" అని అన్నారు.

 

అంతేకాకుండా ఆమె ఆమెపై బలవంతం జరిగిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వ పోవడం కూడా గమనార్హం. వీటన్నింటినీ పరిగణించిన జడ్జి ఆమె వాదన బలంగా లేదని గ్రహించిముద్దాయికి యాంటిసిపేటరీ బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. ఇంకా కేసు విచారణను వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: