ఈ ఏడాది 2020 జనాలకు అస్సలు కలిసి రావడం లేదని అంటున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి వైరస్ కరోనా ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది.  దాంతో ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రపంచం మొత్తంలో మూడో వంతు ఒక్క అమెరికాలోనే కరోనా కేసులు, మరణాల సంఖ్య నమోదు అయ్యాయి. ఆ తర్వాత బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాల్లో కరోనా మరణ మృదంగం వాయించింది.  మన దేశం ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. దేశంలో అసలే కరోనాతో ఛస్తున్నామంటే.. మిడతలు, తుఫాన్ల బాధ ఒకటి మొదలైంది. ఇది చాలదన్నట్లు గత 20 రోజులుగా చమురు దరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21పైసలు, డీజిల్‌ లీటర్‌కు 17 పైసలు పెంచాయి.

 

20రోజుల్లో  పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 79.92 పైసలు, డీజిల్‌ ధర 80.02, చెన్నైలో పెట్రోల్‌ రూ. 83.18, డీజిల్‌ ధర రూ.77.29పైసలు పెరిగాయి.  కో‌ల్‌కతాలో  పెట్రోల్‌ లీటర్‌కు రూ. 81.61, డీజిల్‌ ధర రూ.75.18 పైసలు పెరిగాయి.  ముంబైలో పెట్రోల్‌ రూ. 86.70, డీజిల్‌ ధర రూ.78.34 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 82.96, డీజిల్‌ ధర రూ.78.19పైసలు పెరిగాయి. ఇక దేశంలో కరోనా కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.  గత 24 గంటల్లో దేశంలో 16,922 మందికి కొత్తగా కరోనా సోకింది.

 

అదే సమయంలో 418 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో 16,922 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 418 మంది మరణించారు.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,73,105కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 14,894కి పెరిగింది. 1,86,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,71,697 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: