జనసేన పార్టీలో తెలిసిన దగ్గర  నుంచి ఆ పార్టీకి ఏకు మేకులా తయారయ్యారు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గెలిచిన తర్వాత తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఆయన వైసీపీ కి దగ్గర గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినా ఆయన బయట నుంచి వైసిపి కి మద్దతు ఇస్తూ వస్తున్నారు. నిత్యం వైసీపీ అధినేత జగన్ ను పొగుడుతూ, జగన్ అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తూ వస్తున్నారు. ఇక జనసేన పార్టీ ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో, ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇక మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లోనూ తటస్థంగా ఉండాలంటూ పార్టీ నుంచి ఆదేశాలు అందినా, ఆయన వైసీపీకి ఓటు వేశానని బహిరంగంగా ప్రకటించారు. 

 

IHG's only <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MLA' target='_blank' title='mla-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mla</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAPAKA VARA PRASADA RAO' target='_blank' title='rapaka vara prasad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rapaka vara prasad</a> ...


ఇది ఇలా ఉంటే తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. కాపు కార్పొరేషన్ నిధులు విడుదల అంశంపై జగన్ మాట్లాడిన సందర్భంగా అన్నా రాపాకన్నా అంటూ జగన్ పిలవడంతో ఒక్కసారిగా రాపాక ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. సమావేశంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నా, జగన్ తనను ప్రత్యేకంగా గుర్తుంచుకుని ఆప్యాయంగా పిలవడం పై రాపాక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యేల తో మాట్లాడుతూ జగన్ కు తోటి ఎమ్మెల్యేలు నాయకుల పట్ల ఉన్న అభిమానం, సంస్కారం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ లేదని, జగన్ పిలిచినట్టుగా  ఆప్యాయంగా పిలవలేదని చెప్పారు. 


ఇదే విషయాన్ని తన అనుచరులకు కూడా ఫోన్ చేసి రాపాక ఆనందంగా చెప్పారట. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలు కొన్నిటిని రాపాక గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని బాధపడుతున్నారు.  కొద్ది నెలల క్రితం జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సమావేశానికి తాను ఆలస్యంగా వెళ్లడంపై పవన్ ముందే నాదెండ్ల మనోహర్ తనను తిట్టారని, అయినా పవన్ పట్టించుకోలేదంటూ పవన్ వైఖరిపై విమర్శలు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: