వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక తనని అనేక ఇబ్బందులు పెట్టిన అంశాలలో ఒక అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. కరోనా వైరస్ రాకముందు మార్చి నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేయటం తో ఏకంగా సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఓ సరికొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి పోయేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. దీంతో తన పదవి పోవటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాలలో పోరాడి ప్రభుత్వం పై గెలిచి తిరిగి సంపాదించుకున్నారు. ఈ తరుణంలో వైసీపీ పార్టీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ మనిషి అని ఆరోపణలు చేసిన వాటిని జనాలు మరియు న్యాయస్థానాలు రాజకీయ ఆరోపణల కోణంలో గుర్తించినట్లు అయింది.

 

ఇలాంటి సందర్భంలో న్యాయస్థానం తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పదవి బాధ్యతలు అప్పజెప్పే లా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. ఇంకా పదవి చేపట్టక ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ నగరంలో పార్క్ హయత్ హోటల్ లో చంద్రబాబు కి అత్యంత సన్నిహితంగా ఉండే సుజనా చౌదరి మరియు కామినేని శ్రీనివాస్ తో భేటీ అయినట్లు వీడియో బయటపడటం ఇప్పుడు జగన్ సర్కార్ కి ప్లస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల బట్టి జగన్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని… ప్రజెంట్ పరిస్థితులు అంతా గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

సాధారణంగా స్థానిక ఎన్నికల విషయంలో.. అధికార పక్షంపై విమర్శలు గట్టిగా వినిపిస్తుంటాయి. అధికారులను, పోలీసులను తమకు అనుకూలంగా వాడుకున్నారని.. ప్రత్యర్థులకు తాయిలాలు ఇచ్చి ఏకగ్రీవం చేస్తున్నారని.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుంటాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కమిషనర్ గా పెట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తే ప్రతిపక్ష టీడీపీ నోరు నొక్కెసినట్లవుతుంది...అని జగన్ డిసైడ్ అయినట్లు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియమించాలని కోర్ట్ తీర్పు అమలు చేయాలనీ అనుకున్నట్లు టాక్ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: