ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్స్ కాంట్రాక్టు విషయంలో అవకతవకలు వైసీపీ ప్రభుత్వం చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి అల్లుడు ఈ స్కామ్ లో అతి పెద్ద సూత్రధారుడు అంటూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ని పోలీసులు హౌస్ అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. అయినా గాని ఎక్కడ భయపడకుండా  పట్టాభిరామ్ అంబులెన్స్ విషయంలో అరబిందో సంస్థలకు ఏమాత్రం అనుభవం లేదని, విజయ సాయి రెడ్డి అల్లుడు ఆ కంపెనీలో పని చేస్తున్నాడు కాబట్టి ఆ  కంపెనీకి లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం అబ్రాడ్ అనే పదాన్ని అగ్రీమెంటులో కలిపారు అని లాభం చేకూర్చారు అని ఆరోపిస్తున్నారు.

 

ఇటీవల పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు సమక్షంలో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటాను... అని  కాంట్రాక్టులు జుడిషియల్ సమక్షంలోనే అగ్రిమెంట్లు జరుగుతాయి, జ్యుడీషియల్ కమిటీ పరిశీలించిన తర్వాత మాత్రమే సంతకాలు పెడతాను అని అప్పట్లో జగన్ చెప్పారు. మరి అరబిందో సంస్థకు అంబులెన్స్ కాంట్రాక్టు విషయంలో ఎందుకు జరగలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా స్కామ్ జరిగిందని దానికి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా నిజంగానే ఈ విషయంలో జగన్ సర్కార్ కుంభకోణం చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ కచ్చితంగా న్యాయస్థానానికి వెలేదని… కేవలం తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై విమర్శలు చేయడం కోసమే సరికొత్త క్రియేషన్ చేసినట్లు తాజాగా వస్తున్న ఆంబులెన్స్ కుంభకోణంపై పలువురు విశ్లేషిస్తున్నారు. జగన్ సర్కారు లో నిజంగా ఇంత వందల కోట్ల స్కాం జరిగితే.. టీడీపీ ని సపోర్ట్ చేసే మీడియా ఊరుకుంటుందా..? అంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు. కేవలం జగన్ సర్కార్ పై బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ అంబులెన్స్ స్కాం అంటూ కొత్త క్రియేషన్ స్టార్ట్ చేసిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: