వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలను పెంచే అవకాశం ఉన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో భవిష్యత్తులో 13 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 జిల్లాలు రూపొందించడానికి జగన్ కొత్త ఐడియా తెరపైకి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ పాదయాత్ర లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు పై వైయస్ జగన్ హామీ ఇవ్వడం మనకందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం లోకి వచ్చిన ఏడాదిలోనే ప్రధానమైన హామీలను కీలక ప్రకటనలను నవరత్నాలను అమలులో పెట్టింది జగన్ సర్కార్. ఏడాదిలోనే 90% హామీలను నెరవేర్చినట్లు ప్రస్తుతం ఘనంగా చెప్పుకుంటుంది జగన్ సర్కార్.

 

ఇదే స్పీడు రెండో ఏడాదిలో కొనసాగించాలని సంక్షేమ పథకాల విషయంలో ఇంకా అనేక విషయాలలో చకచకా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాబోయే రోజుల్లో 25 జిల్లాల ఏర్పాటుకు జగన్ ఇప్పటి నుండే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో జగన్ తీసుకుంటున్న ఈ కొత్త ఐడియా వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది రేషన్ కార్డు మరియు ఇంకా ప్రభుత్వం వల్ల లబ్ధి పొందే కొన్ని కార్యక్రమాలకు గండి పడే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

 

కొత్త జిల్లాల జగన్ కొత్త ఐడియా బెడిసికొడితే...మరో తుగ్లక్ నిర్ణయం గా 25 జిల్లాల నిర్ణయం మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గాల వారీగా విభజన పార్లమెంటు విభజన స్థానాలు వలన అనేక ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుందని కాబట్టి ఈ విషయంలో జగన్ సర్కార్ పునర్ ఆలోచిస్తే బెటరని మేధావులు భావిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ లు మరియు ఎస్పీలతో జగన్ భేటీ అయిన సమయంలో ఈ విషయం గురించి ఎక్కువ చర్చించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: