వైసీపీలో విపరీతమైన అసమ్మతి రాజేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి ఇటీవలే వైసిపి అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజులు ఉపేక్షించిన మీదట ఇక లాభం లేదు అన్నట్లు వైసిపి రాజుగారి విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అయితే వైసీపీ ఇచ్చిన నోటీసుకు రాజు గారు ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు పార్టీ యొక్క ఉనికిని, కీలక పదవుల్లో ఉన్న వారి స్థితిగతులను ప్రశ్నించిన రాజు గారి పై తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు జగన్ రంగం సిద్ధం చేశారు.

 

నేపథ్యంలో రఘురామకృష్ణం రాజును ఊరికే వదిలిపెట్టకుండా పార్టీకి వ్యతిరేకంగా తయారైన ఆయనపై బలమైన అర్థం ప్రయోగించేందుకు జగన్ రెడీ అయ్యాడట. దీని ప్రకారం కృష్ణం రాజు పై వాలంటరీ గివెన్ ఆఫ్ మెంబర్షిప్ టు పార్టీ అనబడే అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే రఘురామకృష్ణంరాజు ఏకంగా తన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఇది కచ్చితంగా జరుగుతుంది అని వైసీపీ వర్గాల్లో టాక్.

 

ఇది వరకు ఇలాగే జనతాదళ్ సీనియర్ నాయకుడు శరద్ పవార్ ను కూడా నిబంధన ప్రకారమే అనర్హుడిగా ప్రకటించారు. రఘు రామ్ కు వైసిపి పంపిన నోటీసుల్లో కూడా ఇదే విషయాన్ని క్లుప్తంగా ప్రస్తావించారు. దీంతో అతనిపై వేటు వేయడంతో పాటు అతని లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడం ఖాయమని చెబుతున్నారు. తతంగం కూడా కేవలం మూడు నెలల్లోనే జరుగుతుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: