ఈ మద్య కొంత మంది మానవత్వం మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఐన వారిపై తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నారు.  వర్క్ టెన్షన్, ఇల్లీగల్ కాంటాక్ట్, అధికంగా మద్యం సేవించడం.. ఇలాంటి వాటితో సొంత కుటుంబాన్ని నరక ప్రాయం చేస్తున్నారు. భార్యను హింసించడం.. కన్న బిడ్డలను కొట్టడం లాంటి పాపిష్టి పనులు చేస్తున్నారు. తాజాగా తన కొడుకు అన్నం ఎక్కువ తిన్నాడని దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టిన హృదయవిధారకమైన సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజులు ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి కడుపు మాడ్చాడు. అతడు నీరసించి పోవడంతో ఇరుగురు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.   వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతని దీనమైన పరిస్థితి చూసి చలించిపోయారు. 

 

అసలు వీడు తండ్రేనా ఇంత దారుణానికి ఎలా తెగబడ్డాడు అని ఆశ్చర్యపోారు. వెంటనే అక్కడికి చేరుకొని అతన్నిచికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్‌ కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  సైనీ ప్రాంతంలో కందైలాల్‌ అనే నిరుపేద కుటుంబం నివస్తోంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.  ఇంట్లో వారంతా పని చేస్తున్నా అతని కొడుకు విజయ్ మాత్రం బలాదూర్‌గా తిరిగే వాడు. తండ్రి పని చేయాలని ఎంత చెప్పినా వినిపించుకునే వాడు కాదు. ఈ క్రమంలో ఓ రోజు అతడు ఇంటికి వచ్చి ఎవరికి అన్నం మిగల్చకుండా తినేశాడు.  అదే సమయంలో కుటుంబ సభ్యులు తినడానికి బియ్యం కూడా లేకపోవడంతో తండ్రి కోపంతో ఊగిపోయాడు.

 

అతన్ని గొలుసులతో కట్టిపడేశాడు.  దీనిపై అతన్ని పోలీసులు ప్రశ్నించారు. ఇంట్లో ఆర్థిక కష్టాలకు తోడు పని చేయకుండా ఎక్కువ అన్నం తింటున్నాడని ఆ తండ్రి వెల్లడించాడు. అతను పని చేయకపోయినా తాము ఎప్పుడూ ఇబ్బంది పడలేదని.. ఆ రోజు అందరం కష్టపడి ఇంటికి రాగానే అన్నం మొత్తం తిన్నాడు.. వండుకోవడానికి బియ్యం కూడా లేకపోవడంత పస్తులు పడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి పరిస్థితి చూసి పోలీసులు కూడా కరిగిపోయారు. ఏది ఏమైనా ఇలా శిక్షించడం తప్పని మందలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: