గడిచిన 50 రోజులుగా చైనా భారత్ దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా ఎత్తులు వేస్తుంటే భారత్ ఆ ఎత్తులను చిత్తు చేస్తోంది. అయితే ఇదే సమయంలోచైనాకు పలు దేశాలు భారీ షాకులు ఇస్తున్నాయి. చైనా గతంలో ఆక్రమించిన జపాన్ భూభాగాన్ని ఆ దేశం స్వాధీనం చేసుకుంది. జపాన్ అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని భూభాగాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని చెబుతోంది. 
 
చైనా జపాన్ ప్రకటించుకున్న భూభాగం విషయంలో సైలెంట్ గా ఉండటం తప్ప ఏం చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ ఇప్పటికే మిస్సైల్స్ ను కూడా సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో చైనా గతంలో ఆక్రమించిన టిబెట్ లో భారీ స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. హాంగ్ కాంగ్ లో కూడా నిరసనలు వ్యక్తమవుతూ ఉండగా 5 దేశాల నుంచి చైనాకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తైవాన్, ఫిలిఫ్ఫీన్స్, టిబెటన్స్, మంగోలియా, వియత్నాంలలో ప్రస్తుతం చైనా దేశానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ దగ్గరకు అమెరికా నౌకలు రావడం కూడా వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. చైనా జపాన్ తో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా చైనాకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధనౌకలను తీసుకురావడం ద్వారా అమెరికా చైనాకు సవాల్ విసురుతోంది. 
 
అమెరికా యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం జరిగినా ప్రపంచదేశాలు చైనాకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడే అవకాశం ఉంది ఇదే సమయంలో తమకు చైనా నుంచి పూర్తి స్వతంత్రం కావాలని ఐదు దేశాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనాపై పలు దేశాలు వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉండటంతో చైనా దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రజల్లో తిరుగుబాటు రావడంతో చైనాలోని కమ్యూనిస్టు పార్టీలో కూడా విబేధాలు వచ్చాయని సమాచారం. చైనా ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: