కృషి పట్టుదల.. ఇతరులకు సహాయం చేయాలన్న సంకల్పం ఉంటే ఏదీ అసాద్యం కాదు. దేశంలో ఎంతో మంది అంగవైకల్యంతో ఉన్నవారు ఏమీ చేతకాదు.. ఏమీ చేయలేరు అన్నవారికి తగిన రీతిలో బుద్ది చెప్పిన సందర్భాలు ఉన్నాయి.  అంగవైకల్యాన్ని జయించిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.  దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు పెరిగిపోతున్నాయి.. మరణాల సంఖ్య కూడా తీవ్రం అయ్యింది. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.  అయితే ఇప్పుడు మనిషి బయటకు వెళ్లాలంటే మాస్క్, శానిటైజర్ తప్పని సరి అంటున్నారు. భవిష్యత్ లో కూడా మాస్క్ వాడటం తప్పని సరి అంటున్నారు. మాస్క్ ఇప్పుడు కరోనాని దరి చేరకుండా చేయడమే కాదు.. పొల్యూషన్ నుంచి కూడా మనల్ని కాపాడుకునే సాధనం అంటున్నారు. ఇక కరోనా సమయంలో మనసున్న వారెందరో తమకు తోచిన విధంగా ప్రజలకు సాయం చేస్తున్నారు. కొందరు నిత్యావర వస్తువులు అందిస్తున్నారు.

 

మరికొందరు డబ్బులు అందిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కరోనాను నియంత్రించే మాస్కులను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పదేళ్ల బాలిక మాస్కులు కుట్టి తన ఉన్నత మనసును చాటుకుంది. ఆమె పదేళ్ల బాలిక మాత్రమే కాదు, దివ్యాంగురాలు(ఒక చేయి లేదు) కూడా. కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఆ విద్యార్థిని పేరు సింధూరి. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం మాస్కులు అందించడానికి సింధూరి నేను సైతం అంది.

 

సింధూరికి పుట్టుకతోనే ఓ చేయి లేదు. మౌంట్ రోసరీ అనే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. ప్రజల కోసం ఆ స్కూల్‌కు చెందిన స్కౌట్ అండ్ గైడ్స్ డిపార్ట్‌మెంట్ లక్ష మాస్కులను కుట్టి ఇవ్వాలని భావించింది. అనుకున్నదే తడువు ఒక చేత్తోనే 15 మాస్కులను కుట్టింది.. తన స్నేహితులకు అందరికీ ఇచ్చింది.  తొలుత ఒంటి చేత్తో మాస్కులు కుట్టేందుకు ఇబ్బంది పడ్డానని.. అమ్మ సాయంతో చేయగలిగానని సింధూరి తెలిపింది. మాస్కులు కుట్టి అందజేసినందుకు అందరూ తనను అభినందిండం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: