గో కరోనా ... గో కరోనా ... అంటూ  టిక్ టాక్ చేసిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలడమే కాకుండా అతనితో పాటు మరో నలుగురుకి కూడా కరోనా వైరస్ సోకింది. విజయవాడలో నివసిస్తున్న ఓ వ్యక్తి విజయనగరం రావడంతో వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో అతన్ని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు చెప్పగా అతడు వాటిని లెక్క చేయలేదు. 

 


సదరు వ్యక్తిపై ఎటువంటి పరిరక్షణ చేయకపోవడంతో అతను రూల్స్ పక్కనపెట్టి గ్రామమంతా తన బైక్ పై చక్కర్లు కొట్టాడు. అంతే కాకుండా అతను ఉపాధి హామీ పనులను కూడా వెళ్ళాడు. అక్కడ తనతో పాటు మరో నలుగురికి సోకింది. అయితే ఇప్పుడు అతనితో పాటు టిక్ టాక్ చేసిన వ్యక్తులకు కూడా కరోనా సోకిన అన్న ఆందోళనలో వారి స్నేహితులు పడ్డారు. అయితే వారి ప్రాంతంలో విజయవాడ నుంచి వచ్చిన వారికి ఎక్కువ గా కరోనా నిర్ధారణ జరుగుతుందని తెలుస్తోంది. 

 


విజయనగరం జిల్లాలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన 67 మందికి కరోనా నిర్ధారణ జరిగితే అందులో కేవలం 45 మందికి విజయవాడ నుంచి వచ్చిన వారే. అయితే ఇందులో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్హం. ఒకవేళ వీరి కుటుంబ సభ్యుల్లో వయోవృద్ధులు ఉంటే రికవరీ శాతం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికోసం చాలా జాగ్రత్తగా వ్యవహరించి తమకేం కాదన్న మొండి తో బయట తిరిగి అనేక సమస్యలు సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ తెలియజేశారు. ఇకపోతే రాష్ట్రంలో కర్నూలు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: