చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌కు అండగా బలగాలు పంపుతామని కీలక ప్రకటన చేసింది అగ్రరాజ్యం.  చైనాతో దక్షిణాసియాకు ముప్పుందని స్పష్టంచేసిన అమెరికా.. పీఎల్ఏకు ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది. జర్మనీలోని బలగాలను భారత్‌కు తరలిస్తామని వెల్లడించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో. 

 

అమెరికా సాయుధ బలగాలు భారత్‌కు మద్దతుగా నిలవనున్నాయి. చైనా ముప్పును ఎదుర్కొనేందుకు అండగా ఉండనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో బ్రసెల్స్‌ ఫోరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా వెల్లడించారు. ఇటీవల జర్మనీ నుంచి తన బలగాలను అమెరికా ఉపసంహరిస్తోంది. బలగాల తగ్గింపు ఎందుకన్న ప్రశ్నకు .. భారత్‌, దక్షిణాసియాకు చైనా ముప్పుగా పరిణమించడమే కారణమని తెలిపారు. 

 

సంఘర్షణ స్వభావం ఏంటి? బెదిరింపులు, ముప్పు ఏ మేరకు ఉన్నాయి? వాటిని ఎదుర్కొనేందుకు మన వనరులను ఎలా కేటాయించాలి? అన్న విషయాలపై ఎప్పటికప్పుడు పునస్సమీక్షించుకోవాలన్నారు పాంపియో తెలిపారు. నిఘా, ఎయిర్స్‌ఫోర్స్‌, తీరరక్షక దళాలు ఇలా.. ఏ వనరులనైనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు జర్మనీలో బలగాలను ఉంచారన్నారు. అలాగే ఇతర ప్రాంతాలు.. అంటే చైనా నుంచి ముప్పు ఉన్న భారత్‌, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, దక్షిణచైనా సముద్రం వంటి చోట్లకు బలగాలను పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు పాంపియో.

 

మొత్తానికి భారత్ పై కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా తోకను కట్ చేసేందుకు అమెరికా సైతం సిద్ధమవుతోంది. భారత్ కు సపోర్ట్ గా నిలిచి డ్రాగన్ కంట్రీ కుయుక్తులను తిప్పికొట్టాలని గట్టిగా భావిస్తోంది. అందులో భాగంగానే భారత్ కు అమెరికా బలగాలను దింపుతోంది. తద్వారా చైనా అహంకార పూరిత చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: