ఒక వైపు కరోనా వైరస్ దేశంను అతలాకుతలం చేస్తూ ఉంటే... మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు  చోటు చేసుకుంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేయడం పంజాబ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. చివరకి పనిమనిషి తో కలిపి యజమాని కుటుంబంలో ఉండే నలుగురిని కూడా అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. ఇక రాత్రంతా రక్తపు మడుగులో ఉన్న ఐదుగురి శవాలు పిల్లల ఏడుపు లతో ఆ ఇల్లు అంతా గందరగోళంగా మారింది. ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో శవాలను గుర్తించి చుట్టుపక్కల స్థానికులు పోలీస్ అధికారులకు సమాచారం అందజేయడంతో సంఘటన విషయం బయటకు వచ్చింది. ఇక ఈ దారుణమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

 


పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలోని కైరాన్ గ్రామానికి చెందిన బ్రిజ్లాల్ కుటుంబంలో ఉండే నలుగురిని గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడి దారుణంగా హత్య చేయడం జరిగింది.  ఇక గుర్తుతెలియని వ్యక్తులు దారుణానికి పాలపడుతుంటే అడ్డు వచ్చిన పని మనిషిని కూడా అతి కిరాతకంగా చంపేశారు.  ఇక ఇంటి యజమానిని బ్రిజ్లాల్ ఇంట్లో కుటుంబ సభ్యులను పదునైన ఆయుధాలతో దాడులు చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా ప్రాణాలు విడిచారు. ఇక బ్రిజ్లాల్ కొడుకులు రంజిత్ సింగ్ బాక్సింగ్ డ్రగ్స్ కి అలవాటు అవడంతో  డీఅడిక్షన్ సెంటర్ లో స్థానికులు చేర్పించడం జరిగింది. ఇక అతని భార్య రంజిత్ మే నెలలోనే అమృత్ సర్ జిల్లాలో మృతి చెందింది. డ్రగ్స్ కేసులో పోలీస్ అధికారులు అరెస్ట్ చేసిన రంజిత్ కౌర్ కి 10 ఏళ్లు జైలుశిక్ష పడింది. ఆమె శిక్ష అనుభవిస్తూనే అక్కడే ప్రాణాలు కోల్పోయింది.  ఇక ఇంట్లో ఉంటున్న బ్రిజ్లాల్ కొడుకు బంటు డీఅడిక్షన్ సెంటర్ లో ఉంటున్న అతని భార్యను దుండగులు దాడులకు పాల్పడి అతి కిరాతకంగా చంపేశారు. 

 


ఇది ఇలా ఉండగా ఇంట్లో ఉంటున్న నలుగురు చిన్నారులకు ఎటువంటి హాని కల్పించలేదు. ఇక తన బాబాయి అయిన గుజ్రంత్ తన తల్లి అమన్ దీప్ గొంతు కోసి చంపిన గమనించిన ఒక చిన్నారి, అలాగే రంజిత్ కూతురు పారి పోలీస్ అధికారులకు సమాచారం అందజేసింది. ఇక వేర్వేరు గదుల్లో రక్తం మడుగులో ఉన్న ఐదు మృతదేహాలు పోలీసు అధికారులు గుర్తించారు. అలాగే స్థానికుడు నిషాన్ సింగ్ ఇంటి నిండా రక్తపు మరకలు కనిపించినట్లు పోలీస్ అధికారులకు తెలియజేశాడు. ఇక బ్రిజ్లాల్ కొడుకు హత్య చేశాడా లేక డ్రగ్స్ వ్యాపారంతో సంబంధమున్న ప్రత్యర్థులు ఈ పని చేశారా అనే దిశగా పోలీస్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: