భారత్ చైనా సరిహద్దు సమస్యల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చైనా సైనిక బలగాలు వెనక్కు వెళతాయని చెప్పినా భారత్ నమ్మే పరిస్థితిలో లేదు. జూన్ 15వ తేదీన ఇరు దేశాల మధ్య గాల్వన్ లోయ దగ్గర జరిగిన హింసాత్మక ఘర్షణల్లో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన అనంతరం భారతీయులు చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్ లోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు చైనాకు షాకులు ఇస్తున్నాయి. 
 
ఇండియాలోని పలు రాష్ట్రాలు చైనా దేశం కాంట్రాక్టులను రద్దు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసుకున్నాయి. ప్రస్తుతం లక్ష కోట్ల విలువైన ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టులో చైనీస్ కంపెనీను తొలగించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చైనాకు ఇచ్చినటువంటి 3.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు క్యాన్సిల్ చేస్తోంది. మరోవైపు చైనా దగ్గర అప్పు తీసుకున్న దేశాలు ఆ అప్పులు కట్టలేమని చెబుతున్నాయి. 
 
కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసలు, వడ్డీలు కట్టడం చేత కాదని తేల్చి చెబుతున్నాయి. చైనా ఆ దేశాల్లో సైన్యాలను దింపాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావడం లేదు. చైనా యుద్ధానికి దిగుతామని హెచ్చరిస్తున్నా అదే జరిగితే ప్రపంచ దేశాలు అన్నీ ఏకమయ్యే అవకాశం ఉంది. చైనా 85 దేశాలకు అప్పులు ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణం విషయంలో కూడా చైనా ఇబ్బందులు పడుతోంది. చైనా ఆ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతోంది. చైనాలో 140 డాలర్లకు మించి సంపాదన లేని వాళ్లు 80 శాతం మంది ఉన్నారు. వరుస షాకులతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్లనుందో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: