పాకిస్తాన్ సాంకేతికంగా ఎంతో బలహీనంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా విమానాల విషయంలో అయితే పాకిస్థాన్ విమానాలపై ఎన్నో విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే పాకిస్థాన్కు చెందిన ఒక విమానం కుప్పకూలి పోవడం తో ఏకంగా  పదుల సంఖ్యలో మరణాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. చూస్తుండగానే కళ్ళముందే విమానం కుప్పకూలి పోవడం తో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు పాకిస్తాన్. సాంకేతిక సమస్య కారణంగానే ఈ విమానం కుప్పకూలింది అని నిర్ధారణ అయింది. 

 

 అయితే తాజాగా పాకిస్థాన్లో కుప్పకూలిన విమానం ప్రమాదం ఘటనకు సంబంధించి పాకిస్తాన్ మంత్రి ఒక వింత వాదన వినిపించారు అక్కడి పార్లమెంట్లో. పాకిస్తాన్ లో మొన్న జరిగిన విమాన ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం... పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ విభాగాల పొరపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని ఒక వాదన వినిపించారు. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా ఉండటం  వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాజాగా అక్కడి విమానయాన శాఖ మంత్రి తెలిపారు. మే 27న కరాచీ ప్రాంతం లో కూలిన విమానం ప్రమాదంలో 97 మంది మరణించారు..అయితే  విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదు అంటూ తెలిపారు. 

 


 ఏటీసీ  నుంచి వచ్చిన ఆదేశాలను పైలెట్ పట్టించుకోలేదని.. అంతేకాకుండా విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య గురించి పైలెట్ ఏటిసి కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని... అయితే పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల విమాన  ప్రమాదానికి కారణం అయ్యారు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ప్రస్తుతం అక్కడి విమాన శాఖ మంత్రి ఒక వింత వాదన వినిపించారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఉగ్రవాద చర్య అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిని కవర్ చేయడానికి మంత్రి వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: