భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి చెందిన అంగుళం భూభాగం కూడా ఇతర దేశాలు ఆక్రమించుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. కానీ అంతకు ముందు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రం భారత దేశానికి చెందిన ఎన్నో విభాగాలు పాక్ సహా చైనా కూడా ఆక్రమించుకుంది అనే విమర్శలు కూడా ఎప్పుడు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా చైనా భారత్ సరిహద్దుల ఘర్షణ  జరుగుతున్న నేపథ్యంలో.. భారత భూభాగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆలు వందల కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని అంతేకాకుండా కొన్ని సైనిక ప్రాంతాలను కూడా వదిలేసాము అంటూ  ఒక వీడియో తెర మీదికి వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  2006 సంవత్సరంలో యుపిఎ సర్కార్ పాకిస్తాన్తో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో... సియాచిన్ గ్లేషియర్ ను అప్పటికే ఆక్రమించుకుంది. అక్కడి నుంచి భారత సైన్యం వెనక్కి పూర్తిగా వచ్చేస్తే పాకిస్తాన్ సియాచిన్ గ్లేషియర్ ను  చైనాకు ఒక బహుమతి గా ఇవ్వాలి అని అనుకుంది. 

 


 అయితే సియాచిన్ గ్లేషియర్ రక్షణ పరంగా ఎంతో కీలకమైన ఇటువంటి ప్రాంతం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే అప్పుడు ప్రభుత్వం సియాచిన్ గ్లేషియర్ నుంచి వెనక్కి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసిన  సైన్యం మాత్రం మొండి పట్టుతో  ఉండడం వల్ల ఆ ప్రాంతం ఇంకా భారత్ చేతిలో నే ఉందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ప్రస్తుతం మోడీ హయాంలో మాత్రం గతంలో పాకిస్థాన్ ఆక్రమించుకున్న కొంత భాగాన్ని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: