మాజీ పాత్రికేయుడు, ప్రజారాజ్యం ఆవిర్భావంతో ఎమ్మెల్యేగా నెగ్గి ఆ తరువాత వైసీపీలో చేరి ఇపుడు జగన్ గుడ్ లుక్స్ లో ఉన్న మంత్రి కన్నబాబుకు ప్రమోషన్ గ్యారంటీ అంటున్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా కన్నబాబు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని జగన్ కి నివేదికలు ఉన్నాయట.

 

అంతే కాదు, ఆయన రాజకీయంగా కూడా పదునైన విమర్శలు చేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెడుతున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు అయిన కన్నబాబు గోదావరి జిల్లాలకు చెందిన బలమైన కాపు సామాజికవర్గం నేత. జగన్ ఆయనకు రాజకీయంగా మరింత ప్రోత్సాహం కల్పించడం ద్వారా ఆ జిల్లాలలో పట్టు పెంచుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

 

ఇక ఇదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్తున్నందువల్ల ఉప ముఖ్యమంత్రి పదవిని అదే జిల్లాకు ఇవ్వడం న్యాయమని జగన్ భావిస్తున్నారుట. అదే జరిగితే కన్నబాబే ఆ పదవికి అర్హుడని కూడా అంటున్నారు. ఏడాదిగా కన్నబాబు మంత్రి పాలన బాగుందని సర్వే నివేదికలు కూడా చెబుతున్న నేపధ్యంలో జగన్ ఆయన‌కు మరింత సముచిత స్థానం కల్పించడమే కాదు, మోపిదేవి వెంకటరమణ చూసిన శాఖలు కూడా అప్పగించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

 

ఈ పరిణామంతో జగన్ రాజకీయంగా ఇక్కడ కాస్తా కూస్తా బలం ఉందంకుంటున్న జనసేనకు దెబ్బేయడం, అలాగే గోదావరి జిల్లాల్లో టీడీపీ పట్టు పెరగకుండా చూడడం చేయాలనుకుంటున్నారు. ఇక కన్నబాబు దూకుడు రాజకీయాన్ని కూడా ఉపయోగించుకుని పెద్ద జిల్లాల్లో మరోసారి ఎక్కువ సీట్లను పొందాలన్నది కూడా జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే కన్నబాబుకు ప్రమోషన్ గ్యారంటీ అంటున్నారు.

 


గోదావరి జిల్లాలు సెంటిమెంట్ కూడా వైసీపీకి బాగా పనికివస్తుందని ఆలోచిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా ఉండే ఈ జిల్లాలను ఇకపైన పూర్తిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చెలా చేసే జగన్ మార్క్ ప్లాన్ లో భాగంగా కన్నబాబుని మరింత పెద్ద వాణ్ణి చేయాలనుకుంటున్నారని టాక్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: