తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కరోనా ప్రభావం పర్సంటేజ్ విషయంలో ఏకంగా తెలంగాణలో 122 పర్సంటేజ్ కరోనా వ్యాప్తి ఉన్నట్లు...లెక్కలు తెలిపాయి. ఒకానొక సమయంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ పెరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వైరస్ ప్రభావం తగ్గినట్లు పరిస్థితి కనబడింది. ఆ సమయంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి నుండి తెలంగాణ రాష్ట్రం బయటపడినట్లే అని తెలిపారు. ఆ టైంలో పెద్దగా విపక్షాలు కూడా తెరపైకి రాలేదు విమర్శలు ఎక్కడ చేయలేదు.

 

కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మారిపోవడంతో కేంద్రం నుండి న్యాయస్థానాలు నుండి అదేవిధంగా ప్రతిపక్షాల నుండి ఎటు చూసినా విమర్శలు కేసీఆర్ సర్కార్ పై వస్తున్నాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా జరగడం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని కేసీఆర్ సర్కార్ పై మొట్టికాయలు పడుతున్నాయి. కనీసం కరోనా వైరస్ చికిత్స చేస్తున్న వైద్యులు కూడా కాపాడలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందని జాతీయ స్థాయిలో నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. మరోపక్క కరోనా చికిత్స చేసిన వైద్యులు కూడా ప్రభుత్వం సరైన కిట్లు ఇవ్వడం లేదని కూడా విమర్శలు చేయటం దారుణం.

 

ఇదే టైములో పోలీసులకు మరియు పొలిటిషన్ లకు కూడా కరోనా వైరస్ సోకుతున్నట్లు కేసులు బయటపడటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య జనులలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో అసహనం నెలకొన్న పరిణామాలు ఏర్పడ్డాయి. ఒకపక్క ఐసీఎమ్ఆర్ చెప్పినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెబుతున్నారు గాని మరోపక్క వాస్తవంలోకి వెళితే నిర్ధారణ పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కార్ సరైన రీతిలో పనిచేయడం లేదని అంతర్గతంగా వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: