ఏం ప్రజలండీ బాబు.. ఒక్కరంటే ఒక్కరికి కూడా పూర్తి బాధ్యత లేదు.. అసలే కరోనా తన 24 ఫ్రేం లో బాహుబలికంటే బలమైన సినిమా చూపిస్తుంటే.. ప్రజలంతా ఎగబడుతున్నారే గానీ జాగ్రత్త పడటం లేదు.. ముఖ్యంగా రోడ్లమీద, వైన్స్ షాపుల్లో జనాన్ని చూస్తే.. అసలు మనదేశంలో కరోనా అనేది ఒకటుందా అనే అనుమానం రాక తప్పదు. ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులకు ఎవరు బాధ్యత వహించాలో ప్రజలే అర్ధం చేసుకోవాలి..

 

 

ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 985 కొత్త కేసులు వెలుగు చూడగా, అందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 774 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 75,308 మందికి పరీక్షలు నిర్వహించారు. నిన్న నిర్వహించిన పరీక్షల్లో 3,389 మందికి నెగటివ్ అని తేలగా, 985 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య వీటితో కలుపుకుని 12,349కి చేరుకోగా, 7,436 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే ప్రభుత్వం చేయి దాటిపోయిన పరిస్దితులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.. దీనివల్ల రోజుకి సగటున పదిహేను వేల కేసులు నమోదవుతున్నాయంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్ధం అవుతుంది..

 

 

ఈ నేపధ్యంలో వైద్యనిపుణులు సంచలన ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతోందని, ఒక రోగి నుంచి మరో రోగికి ఈ వైరస్ వ్యాపిస్తుందని, అంటే కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందని అంగీకరించాల్సిందేనని పేర్కొంటున్నారు.. ఇకపోతే దేశంలో ఇప్పటివరకు 4 లక్షల 90 వేల కేసులు నమోదయ్యాయి. వాటిలో 15,301 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి 2 లక్షల 86 వేల మంది కోలుకున్నారు. ఇక ఇప్పటినుండైనా ప్రజలు అప్రమత్తం అవకపోతే రానున్న రోజుల్లో పరిస్దితులు మరీ ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: