ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు ఈ సైబర్ క్రైమ్స్ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇంకా కరోనా వైరస్ ను అడ్డు పెట్టుకొని మరి దారుణంగా తయారయ్యారు. ఉ అంటే చాలు ఎక్కడో ఒకచోటా లక్షలు లక్షలు దోచేస్తున్నారు. సైబర్ పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంత సూచిస్తున్న ఉపయోగం లేకుండా పోయింది. 

 

ఇంకా ఇప్పుడు కూడా హైదరాబాద్ లోని నారాయణగూడలో ఇలాంటి దారుణమైన ఘటనే చోటు చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత సైబర్ నేరగాళ్లు బాయ రెచ్చిపోయారు. ఇప్పుడు కూడా ఇండియా మార్ట్‌ అనే సైట్‌లో హోల్‌సేల్‌ ధరలకే మాస్కులు, గ్లౌజ్‌లు అందిస్తాం అంటూ హంగేరి దేశానికి చెందిన ఓ కంపెనీ పేరిట ఇటీవల ప్రకటన చేశారు. 

 

అయితే ధరలతో పాటు ఒక మంచి కొటేషన్‌ ఉంచింది. ఇంకా ఆ కొటేషన్‌ ను చుసిన జూబ్లీహిల్స్ లోని ఓ సంస్ద గ్లౌజ్‌, మాస్కులను హోల్‌సేల్‌లో విక్రయించేందుకు హంగేరి కంపెనీని సంప్రదించింది. దీంతో ఇద్దరూ కొటేషన్లు ఇచ్చి పుచ్చుకున్నారు. హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్‌ ద్వారా అగ్రిమెంట్‌ పంపించాడు. 

 

ఇంకా ఆ అగ్రిమెంట్ పై జూబ్లీహిల్స్‌లోని సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్‌లో పంపించారు. అయితే సరుకు పంపించాలంటే కనీసం 50 శాతం పేమెంట్‌ చేయాల్సి ఉంటుందని విదేశీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. దీంతో హంగేరిలోని ఓ బ్యాంక్‌ ఖాతాకు ఏకంగా రూ.30 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. 

 

అయితే ఎన్ని రోజులు అయినా సరుకు రాకపోవడంతో ఆ కంపెనీ ప్రతినిధిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో సంస్ద యాజమాన్యం మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్‌ సైబర్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అందుకే ఏదైనా చేసేముందు వెనుక ముందు ఆలోచించుకోవాలి అని చెప్తుంటారు. ఏది ఏమైనా.. ఆన్లైన్ సేల్స్ ని నమ్మకుండా ఉంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: