నిర్భయ చట్టం వచ్చిన.. దిశా చట్టం వచ్చిన కొన్ని మానవ మృగాలు ఎప్పటికి మారావు. ఎంతమందికి ఉరి శిక్ష వేస్తే ఏంటి? ఎంతమందిని ఎంకౌంటర్ చేస్తే ఏంటి ? ఇంట్లోనే అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒకచోటా మామ.. మరొకచోటా తండ్రి ఇలా అభం శుభం తెలియని ఆడపిల్లలపై ఇళ్లలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. 

 

IHG

 

ఇవి అన్ని చూస్తే అనిపిస్తుంది.. అమ్మాయిలకు ఇంకా రక్షణ ఎక్కడ ఉందని? నిత్యం ఎక్కడో ఒకచోటా చిన్నపిల్లలు, మహిళలు అని తేడా లేకుండా అత్యాచారాలు చేస్తున్నాయి మానవ మృగాలు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన చిటుచేసుకుంది. 

 

IHG

 

కన్నతండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన విజమూరులో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరులోని వింజమూరు పంచాయితీకి చెందిన వ్యక్తి తన కుమార్తెను గురువారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు.. ఇంకా అదేరోజు సాయింత్రం బైక్ పై ఇంటికి తిరిగి బయల్దేరాడు. 

 

IHG

 

అయితే మద్యంమత్తులో ఉన్న తండ్రి మార్గంమధ్యలోనే కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా తండ్రి నుండి తప్పించుకున్న ఆ బాలిక ఇంటికి చేరుకొని తల్లికి ఆ విషయాన్నీ చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీసులుకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.చూశారుగా.. ఈ కాలంలో కన్నతండ్రిని నమ్మేలేని స్థితికి చేరుకున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: