బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా అఘాయిత్యాలుకు మాత్రం పులిస్టాప్ పడట్లేదు. ఇక మరోవైపు మహిళలకు అండగా ఉండాల్సిన పోలీసులే వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ లో మేనకోడలు పై ఓ పోలీసు చేసిన అత్యాచారం సంఘటన మరిచిపోక ముందే మరో దారుణం వెలుగులోకి రావడం జరిగింది. 13 సంవత్సరాల బాలికపై ఒక పోలీస్ అధికారి తోపాటు మరో పోలీస్ అధికారి సవతి తండ్రి అతని స్నేహితుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది.

 


ఇక రక్షణ అందించవలసిన పోలీసులే ఇలా బాలికపై గాయానికి పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇక వాళ్లు చేసిన తప్పు బయటకి రాకుండా ఉండేందుకు ఆ బాలికకు అబార్షన్ కూడా చేయించారు. ఈ దారుణమైన సంఘటన ఒడిస్సా లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా లోని సుందర్ ఘర్ జిల్లా వీర మిత్ర పూర్ లో సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన శిశు సంక్షేమ కమిటీ అధికారి తెలియజేసిన సమాచారం మేరకు.. బీర మిత్ర పూర్ పట్టణంలో బస్టాండ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న 13 సంవత్సరాల బాలికను శిశు సంక్షేమ కమిటీ సభ్యులు రక్షణ కల్పించారు. కమిటీ వారి ఆ బాలికను హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స ఇప్పించారు.

 


దీనితో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యాధికారులు ఆ బాలికకు అబార్షన్ జరిగినట్లు తెలిపారు. ఇక ఆ బాలిక శిశు సంక్షేమ కమిటీ సభ్యులకు జరిగిన విషయం గురించి పూర్తిగా తెలపగా, వారందరూ కూడా నన్ను నాలుగు నెలలుగా శారీరకంగా హింసిస్తున్నారని అధికారులకు తెలిపింది. అందుకు ఫలితంగా గర్భం దాల్చడంతో తనకు బలవంతంగా అబార్షన్ చేయించి బస్టాండ్ లో  వదిలి వెళ్లారని తెలియజేసింది. ఇక దీనితో ఆ నలుగురిపై ఎస్పీ సౌమ్య మిత్ర కు ఫిర్యాదు చేయడంతో... ఈ సంఘటనపై ఎస్పీ మహిళా డీఎస్పీతో కలిసి తక్షణమే స్పందించి అధికారుల బృందంతో దర్యాప్తు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: