గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరు  చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి జగన్ పై కొంత మంది సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అందరూ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం మొదటి నుంచి అధినేత జగన్ తీరుపై ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్లు చేయడం... ఆయనకు వ్యతిరేకంగా ముందుకు వెళుతుండటం  చేస్తున్నారు.




 దీంతో రోజురోజుకీ రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు కీలక నేత అయిన విజయసాయి రెడ్డి పార్టీ తరఫున వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ సాంప్రదాయాలకు పార్టీ అధినేత లక్ష్యాలకు విరుద్ధంగా రఘురామకృష్ణంరాజు ప్రవర్తిస్తున్నారని  నోటీసులో పేర్కొన్నారు వైసిపి ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి. షోకాజ్ నోటీసుపై వెంటనే వివరణ ఇవ్వాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటాము అంటూ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసుల్లో  హెచ్చరించారు.




అయితే ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నట్లు  తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ సహ ఎన్నికల కమిషన్ అధికారులను నిన్న కలిశారు రఘురామకృష్ణంరాజు. ఇక తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తనకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుపై చర్చిస్తున్న రఘురామకృష్ణంరాజు... ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసిపి పార్టీ అసలు పేరు... తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు లో ఉన్న వైసిపి పేరు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ ఆరోపిస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: