తాజాగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం శివారులో ఉన్న SPY ఆగ్రోస్ కంపెనీ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న 50 సంవత్సరాల ఉద్యోగి మృతి చెందగా... మరో ముగ్గురికి పరిస్థితి బాగానే ఉందని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తెలియజేశారు. అయితే ఈ లీక్ కేవలం ఫ్యాక్టరీ లోపల జరిగిందని అయితే గ్యాస్ బయటికి రాలేదని దింతో ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని సేఫ్టీ చర్యలను అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ పరిశ్రమలు వైద్య శాఖ అధికారుల ద్వారా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలియజేశారు.

IHG


 విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి అత్యవసర శాఖల అధికారులను అప్రమత్తం చేసి రంగంలోకి దింపి సేఫ్టీ చర్యలు చేపట్టామని తెలియజేశారు. ఇక సంఘటనా స్థలాన్ని స్వయానా కలెక్టర్ వీర పాండ్యన్ జిల్లా ఎస్పీ పకీరప్ప జాయింట్ కలెక్టర్లు మొదలు ఉన్నత అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదకరమైన వాయువులు బయటికి రాకపోవడంతో అందులోనూ ఫ్యాక్టరీ పట్టణ శివారులో ఉండడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

IHG

 


గ్యాస్ ఫ్యాక్టరీ లోపల లీక్ అవడంతో బారీ ప్రాణ నష్టం నుంచి తప్పించుకున్నట్లు అయింది. లేకపోతే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రాణ నష్టం ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. ఇప్పటికే విశాఖపట్నం లో గ్యాస్ లీక్ అయిన ఘటన మరువక ముందే మరో ఘటన ఇలా చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో హడలిపోయారు. ఇకపోతే ఈ కంపెనీలో కొన్ని రోజుల క్రితమే విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి విష వాయువులు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. అయినా కానీ విషవాయువు విడుదల అవ్వడంతో ప్రజలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: