కరోనా మహమ్మారి ప్రభావంతో యావత్ ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఈ మహమ్మరిని ఎదుర్కొడానికి అన్ని దేశాలు రాత్రిమ్బవళ్ళు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో 99 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ దెబ్బతో అన్ని రంగాల్లో కుదేలయిపోయాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పడిపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది.

 

 

దేశీయ బ్యాంకులు ,ప్రయివేట్  బ్యాంకింగ్ వ్యవస్థలు అన్ని కొంచెం కొంచెంగా నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ బ్లూచిప్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ‘జంక్‌’ హోదాను ప్రకటించింది. కోవిడ్19 వల్ల అన్ని బ్యాంకుల ఆర్థిక మెరుగుదల క్షీణీస్తోందని అభిప్రాయపడింది. ఈసారి కొన్ని బ్యాంకుల రేటింగ్ ను సవరించింది. 

 

 

దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎకనమిక్‌ రిస్కుల నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఈ సందర్భంగా పేర్కొంది.యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్‌ అంతర్జాతీయ ఫైనాన్షియల్‌, గిఫ్ట్‌ సిటీ, హాంకాంగ్‌ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.

 

 

బజాజ్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను సైతం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను  BB+/స్థిరత్వం/Bకు సవరించింది.ఇదే విధంగా ఇండియన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను క్రెడిట్‌ వాచ్‌గా సవరించింది. రానున్న త్రైమాసికాలలో బ్యాంక్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలహీనపడనున్నట్లు ఎస్‌అండ్‌పీ అంచనా వేస్తోంది.తద్వారా కోవిడ్‌-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. కరోనా వైరస్ వ్యాప్తి తో బ్యాంకుల ఆర్థిక లావాదేవీల పనితీరు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ ఇచ్చిన రేటింగ్స్ ఆర్థిక వ్యవస్థలకు గుబులు పుట్టిస్తున్నాయు. కోవిడ్ ప్రభావం ఇలాగే కొనసాగితే అంతకంతకూ దిగజారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: