2020 ప్రతి మనిషి తన జీవితంలో మర్చిపోలేని ఏడాది అవుతుంది.  ఈ ఏడాది జనవరి నెల తర్వాత ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు మన దేశంలో మొదలయ్యాయి.  మొదట కేరళాలలో ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చిందని అన్నారు.. ఆ తర్వాత దేశమంతా కరోనా వ్యాప్తి చెందింది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,73,105కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 14,894కి పెరిగింది. 1,86,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,71,697 మంది కోలుకున్నారు. ఇక కరోనాతోనే నానా కష్టాలు పడుతున్నామంటే ఇప్పుడు పాకిస్థాన్ నుంచి మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాల్లో మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది.

IHG

పంటల పొలాలపై పడి సర్వ నాశనం చేస్తున్నాయి. వేలకు వేల ఎకరాల పంటను స్వాహా చేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్‌ మీదుగా భారత్‌ మీద దండెత్తిన ఈ మిడతల దండు.. ఇప్పుడు మహారాష్ట్రలోకీ ప్రవేశించింది. అక్కడ నుంచి తెలంగాణలోకి కూడా వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇంకొన్ని చోట్ల మిడతల దండుపై క్రిమి సంహారాలను చల్లుతున్నారు. తాజాగా గుర్గావ్‌లో నిత్యం రద్దీగా ఉండే ఎంజి రోడ్ , ఇఫ్కో చౌక్ ప్రాంతాల్లో మిడతలు తిరుగుతున్నాయి. దీంతో రోడ్లమీద తిరిగేందుకు జనం అయిష్టత ప్రదర్శిస్తున్నారు.

IHG

అంతేకాకుండా ఎక్కడైనా పచ్చగా కనిపిస్తే చాలు క్షణాల్లో అక్కడ వాలి చెట్లను బోడు చేస్తున్నాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. హ‌ర్యానాలోని జ‌జ్జ‌ర్ స‌హా ప‌లు జిల్లాల్లోని పంట చెల‌క‌ల‌పై మిడ‌త‌ల గుంపులు దాడులు చేస్తున్నాయి. దీంతో జ‌జ్జ‌ర్ జిల్లా అధికార యంత్రాంగం మిడ‌త‌ల‌ను త‌రిమికొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మిడత‌ల ప్ర‌భావం ఉన్న ప్ర‌తి గ్రామానికి స్థానిక‌ సిబ్బంది వెళ్లి సైర‌న్‌ల సాయంతో వాటిని త‌రిమి కొడుతున్నారు. ఇక్కడ   గిన్నెలు, బిందులు కొడుతూ.. డ్ర‌మ్స్ వాయిస్తూ మిడ‌త‌ల‌ను త‌రుముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: