ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవ్వరికీ తెలీదు. బస్ లో వెళ్లినా, కార్ లో వెళ్లినా , బైక్ మీద వెళ్లినా నడిచి వెళ్లినా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తగా చేయాలి అంటారు. కానీ కొంతమంది వాహనాన్ని చాలా స్పీడ్ గా నడుపుతారు. అతివేగంతో జరిగిన ప్రమాదాలు వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదమే జమ్మూ8 లో జరిగింది. జమ్మూకాశ్మీర్ లో ఎక్కువగా లోయ ప్రాంతాలు ,కొండ ప్రాంతాలు ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటపుడు. చాలా నెమ్మదిగా వెళ్ళాలి. తేడా వస్తే అంతే సంగతులు.

 

 

అలాంటి ఘటనే ఒకటి అక్కడ జరిగింది. తాజాగా జమ్ముకశ్మీర్లో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దోడా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.లోయ ప్రాంతాల్లో అత్యంత నెమ్మదిగా వెళ్లాలంటూ సైన్ బోర్డులు పెడ కానీ వాహనదారులు అవన్నీ పట్టించుకోకుండా ఓ కారు ను స్పీడ్ గా నడుపుతారు ఏమవుతుందిలే అంటూ వారు వెళ్లే వేగంతోనే వెళ్తుంటారు చివారికేజ్ అదుపుతప్పి ప్రమాదాల బారినపడుతూ ప్రాణాలనే కోల్పోతుంటారు. ఇందులో కొన్ని డ్రైవర్ల తప్పిదం వల్ల జరిగితే ,  మరికొన్ని రోడ్లు సరిగ్గా లేక జరుగుతుంటాయి. జిల్లాలోని రగీ నాలా వద్ద కారు వేగంగా వచ్చి 300 మీటర్ల లోతున్న నాలాలో పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు జలసమాధి అయ్యారు. ఘటనను కళ్లారా చూసిన పలువురు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

 

 

ఈ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడంతోనే నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు కొత్తేమి కాదు గత వారం కూడా ఇదే ప్రాంతంలో మూడు ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాగే వదిలేస్తే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: