కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో బరువే గ్రామంలో ఒక రైతు పట్ల బ్యాంకు అధికారులు చూపించిన విపక్షకు ఉదాహరణగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. కేవలం రూ. 3.46 పైసలు అప్పు చెల్లించడం కోసం ఒక బ్యాంకు ఉద్యోగి ఒక రైతును దాదాపు 15 కిలోమీటర్ల దూరం  నడిపించిన సంఘటన చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు బ్యాంకులో నుంచి అప్పులు గా తీసుకొని... వాళ్లకి టోపీలు వేస్తూ విదేశాల్లో ఉంటూ వారి ఒక్క పైసా కూడా వసూలు చేయాలని ఈ బ్యాంకులు వ్యవసాయం చేయడానికి రైతులు తీసుకున్న అప్పులు మాత్రం బెదిరించి మరీ వసూలు చేస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాను.  

 


అయితే లక్ష్మీనారాయణ అనే  రైతు వక్కల పెంపకం వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతను సమీప పట్టణం లో ఉన్న కెనరా బ్యాంకు నుంచి రూ. 35 వేల రూపాయలు వ్యవసాయ రుణం తీసుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ లో దాదాపు రూ. 32 వేల రూపాయలు మాఫీ అయింది. మిగిలిన మూడు వేల రూపాయలు కూడా ఆ రైతు బ్యాంకుకు చెల్లించడం పూర్తి కూడా చేశాడు. దీనితో రుణ మొత్తం తిరి పోయిందని ఆ రైతు అనుకున్నాడు. అప్పు మొత్తం కట్టేస్తాను కనుక బ్యాంకు నుంచి మరోసారి రుణం తీసుకోవచ్చు అని ఆ రైతు భావించాడు. ఇలా ఉండగా ఒక రోజు అకస్మాత్తుగా ఆ రైతుకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. మీరు తీసుకున్న లోన్ మొత్తం కట్టలేదని వెంటనే బ్యాంకు కి రావాలని బ్యాంకు అధికారులు తెలియజేశారు.

 


దింతో కంగారు పడిపోయి అదేంటి నేను మొత్తం కట్టేస్తానంటూ లక్ష్మీనారాయణ బ్యాంకు వెళ్లడానికి  సిద్ధమయ్యాడు. లాక్ డౌన్ కారణంతో వాహనాలు సరిగ్గా తిరగటం లేదనే విషయం గుర్తుకు వచ్చి దాంతో వేరే మార్గం కనపడక అతను నడుచుకుంటూ బ్యాంకు కి వెళ్ళాడు. బ్యాంకు అధికారి బ్యాంకు రూ. 3.46 పైసలు అప్పు ఉందని చెప్పడంతో దీనితో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఈ చిన్న మొత్తం అప్పు కోసం పదిహేను కిలోమీటర్లు నన్ను నడిపించారని, ఇదే విషయం తనకు ఫోన్ చేసినప్పుడు బ్యాంకు అధికారి ఫోన్ లోనే చెప్పి ఉండొచ్చు కదా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆ రూ. 3.46 పైసలు బ్యాంకు అధికారులకు ఇచ్చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇక ఈ సంఘటనపై బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ కొత్తగా లోన్ఇవ్వడానికి కుదరదు, అందువల్లే ఆ డబ్బును అడిగామని తెలియజేశారు. ఈ విషయం సోషల్ మీడియా లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: