వ్యాక్సిన్​ లేని కరోనా వైరస్​ బారిన పడకూడదంటే ఉన్న ఏకైక మార్గం జాగ్రత్తలు పాటించడం. ఇందులో భాగంగా మాస్కులు, శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే చేతులు శుభ్రపరుచుకున్నా.. ఎప్పటికప్పుడు ముట్టుకునే వస్తువులను శుభ్రం చేసుకోవడం ఎలా? తరచూ వాడే ఫోన్​, వాచ్​, రింగ్​ వంటి వాటిపై వైరస్​ ఉంటే గుర్తించడమెలా ..? వైరస్​ చెక్క, స్టీల్​ వంటి ప్రదేశాలపై ఎక్కువ సమయం ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించారు. అందుకే సబ్బు, నీళ్లు, ఐసోప్రొఫైల్​ ఆల్కహాల్​ సాయంతో వైరస్​ను కడిగేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. అయితే గ్యాడ్జెట్లను శుభ్రం చేయడానికి అవి పనిచేయవు. అందుకే వాటి కోసం ప్రత్యేకమైన శానిటైజర్​ పరికరాలు తయారు చేస్తున్నాయి సంస్థలు.

 


యూవీ లైట్​(అతినీలలోహిత కిరణాలు) సాయంతో గ్యాడ్జెట్లు లేదా ఎలక్ట్రానిక్​ వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. క్రిములు, బాక్టీరియా, వైరస్​ చంపడంలో ఇవి బాగా తోడ్పడతాయి. ప్రతిరోజు వాడే వస్తువులను శుభ్రం చేసుకునేందుకు ఉన్న సాధనం యూవీ-సీ పాకెట్​ స్టెరిలైజర్​. దీని ధర రూ.2,199. దీనితో దాదాపు 99.9 శాతం క్రిములను చంపేయొచ్చట. అదీ 10 సెకన్ల నుంచి 3 నిమిషాల్లోనే! వస్తు పరిమాణంపై ఆ సమయం ఆధారపడి ఉంటుంది. ఈ పరికరంలో యూవీ-సీ లైట్​, సెన్సార్లు, వర్క్​ ల్యాంప్, ఎలక్ట్రిక్​ ల్యాంప్​, యూవీ-సీ ల్యాంప్​ వంటి భాగాలు ఉంటాయి.

 


దీనికి 400 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 100 నిమిషాల బ్యాటరీ స్టాండ్​బై లైఫ్​ ఉంటుంది. ఇందులోని ఎల్​ఈడీ దాదాపు 5 వేల నుంచి 10 వేల గంటల వరకు పనిచేస్తుంది. దీన్ని డైలీ ఆబ్జక్ట్స్​ అనే సంస్థ తయారు చేస్తోంది. ఇది పాకెట్​లో పట్టే పరిమాణంలో ఉండే డిస్​ప్లే క్లీనర్​. దీని సాయంతో ల్యాప్​టాప్​ స్క్రీన్లు, ట్యాబ్​లు, మొబైళ్లు శుభ్రం​ చేసుకోవచ్చు. దీనికి చిన్నపాటి స్ప్రే, మైక్రో ఫైబర్​ క్లాత్​ ఉంటాయి. స్ప్రే సాయంతో శుభ్రం చేసే ద్రవాన్ని స్క్రీన్​పై చిమ్మి.. ఇచ్చిన ఫైబర్​ క్లాత్​తో శుభ్రం చేసుకోవాలి. దీని ధర రూ.249 మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: