దేశం మొత్తం కరోనా పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ మాయదారి కరోనా మనిషి పాలిట శాపంగా మారింది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 18,552 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,08,953కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 15,685కి పెరిగింది. 1,97,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకున్నారు. జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 79,96,707 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. అయితే కరోనా ఒకరి నుంచి ఒకరికి క్షణాల్లో విస్తరిస్తుంది.

 

అందుకే జాగ్రత్తలు పాటించాలని.. మాస్క్ తప్పని సరి, సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే దగ్గరలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని.. అవసరమైతే క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం వందల మందికి శాపంగా మారుతుంది. తూర్పో గోదావరి జిల్లాలో కొవిడ్‌ కేసులు మరింతగా పగడ విప్పుతున్నాయి. జిల్లాలో శనివారం ఏకంగా 109 కేసులు నమోదయ్యాయి.. ఏఏ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఏకంగా జిల్లావ్యాప్తంగా 117 కేసులు నమోద య్యాయి. ఇందులో ఒక్క సామర్లకోట మండలంలో తొలిసారిగా ఒకేరోజు 42 కేసులు గుర్తించారు. వీరందరికి ఈనెల 21న పరీక్షలు చేయగా ఫలి తాలు శుక్రవారం వచ్చాయి. ఇందులో 36 మంది ఒక్క అమ్మాణ్ణమ్మ కాలనీ లోనే గుర్తించారు.  ఈ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు ఈనెల 17న హైదరాబాద్‌ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత యథేచ్ఛగా సంచరించారు. వారికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌ వచ్చింది. ఫలితంగా అదే కాలనీలో ఉంటున్న వారందరికి పరీక్షలు చేయగా, ఆ ఇద్దరి నుంచి వైరస్‌ వ్యాపించి ఏకంగా 36 మంది బాధితులుగా తేలారు. ప్రస్తుతం ఇక్కడ రెజ్ జోన్ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: