చదువు అంటే ఇలా ఉండాలి ర్యాకుల వస్తేనే మన పిల్లలు బాగా చదువుతున్నారు అని తల్లిదండ్రులు అనుకునేలా సొసైటీ ని మార్చేసాయి కార్పోరేట్ విద్యా సంస్థలు. అత్యుత్తమైన విద్యను అందిస్తాం మీ పిల్లల భవిష్యత్ మా బాధ్య అంటూ ఎల్కేజి నించే లక్షల లక్షలు ఫీజ్ లు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు కార్పోరేట్ విద్య సంస్థలో చదివించాలి అని ఆస్తులు అమ్ముకొని మరీ పిల్లన్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే పరీక్షల ఫలితాలు వస్తే చాలు అన్ని ర్యాంకులు మావే అంటూ విద్యాసంస్థల టీవీల్లో మోతమోగిస్తుంటాయి.

 


ఇవన్నీ తల్లిదండ్రులు చూసి తమ పిల్లని ఎందులో చేర్పించాలో తెలీక అయోమయంలో పడిపోతున్నారు. అన్ని సంస్థలు మొదటి ర్యాంకులు మావే అంటూ ప్రకటనలు టీవీల్లో మారుమోగిపోతాయి. అయితే ఇవన్నీ చట్ట వ్యతిరేకం అని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇటీవల రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు , పత్రికల్లో ప్రచారం చేస్తున్న కళాశాలలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు.

 


 తమ కళాశాల విద్యార్థులే రాష్ట్ర , జిల్లా , నియోజకవర్గ , పట్టణ , మండల స్థాయి టాపర్లుగా , ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తమకు సమాచారం అందిందని, ఇదీ బోర్డు రూల్సుకు పూర్తి విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన కళాశాలలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రూల్స్ అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ విధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులను ఆకట్టుకోడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఇకపై అలా ప్రకటనలు చేసేవారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: