రామోజీరావు.. తెలుగువాళ్లలో గొప్ప వ్యాపారవేత్త.. అంతకు మించి గొప్ప క్రెడిబిలిటీ ఉన్న వ్యాపారవేత్త. ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలింసిటీ, ప్రియాఫుడ్స్, కళాంజలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ఇక రామోజీ ఫిలింసిటీ ఏకంగా గిన్నిస్ బుక్‌లోనే చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ పూర్తి చేసున్నాయి.

 

 

నిర్మాత స్క్రిప్టుతో వస్తే చాలు.. ఫస్ట్ కాపీతో బయటకు వెళ్లేలా రామోజీ ఫిలింసిటీని రూపొందించారు రామోజీరావు. బాహుబలి వంటి కళాఖండం అంత గొప్పగా వచ్చిందంటే రామోజీ ఫిలింసిటీ కారణంగానే అంటారు రాజమౌళి కూడా. అసలు రామోజీ రావు కాన్సెప్టులన్నీ అంతే.. సాధారణ వ్యాపారవేత్తలకు అందవు. ఆయన భవిష్యత్తును అంచనా వేసి వ్యాపారం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా..

 

 

అలాంటి రామోజీ ఫిలింసిటీ ఇప్పుడు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిస్నీ హాట్ స్టార్‌ తో ఒప్పందం కుదుర్చకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ వరల్డ్ ఈ మేరకు ఓ కథనం రాసింది. దాని ప్రకారం.. డిస్నీ హాట్‌స్టార్ మూడేళ్లపాటు రామోజీ ఫిల్మ్ సిటీని అద్దెకు తీసుకుంది. ఇకపై అక్కడ ఏ షూటింగులు జరగాలో, జరగొద్దో కూడా ఆ సంస్థే నిర్దేశించబోతున్నది. ఇది రిపబ్లిక్ వరల్డ్‌లో వచ్చింది 20వ తారీఖున.

 

 

డిస్నీ వరల్డ్ ఫేమస్ కంపెనీ. హాట్‌స్టార్ పాపులర్ ఓటీటీ. డిస్నీ ఈ హాట్‌స్టార్‌ను ఓన్ చేసుకుంది. డిస్నీకి ఇండియాలో చాలా విస్తరించాలని ఉంది. అందుకే రామోజీ ఫిలిమ్ సిటీని ఎంచుకుంది. ఎలాగూ ఇకపై రాబోతోంది ఓటీటీ కాలమే కాబట్టి ఇది మంచి నిర్ణయమే అని చెప్పాలి. అయినా రామోజీరావు స్టెప్ వేశారంటే.. అన్ని కోణాల్లోనూ ఆలోచించకుండా ఉంటారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: