వైయస్ జగన్ రాజకీయ ప్రయాణం లో చాలా టర్నింగ్ పాయింట్ లు విశాఖపట్టణం కేంద్రంగా చోటుచేసుకున్నాయి. మొదటి నుండి వైజాగ్ అంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు వైయస్ జగన్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని విషయంలో వైయస్ జగన్ విశాఖపట్టణానికి టార్గెట్ చేసుకున్నారని అందువల్లే తన తల్లి విజయమ్మ ను 2014 ఎన్నికల్లో అక్కడ నుండి పోటీ చేయడం జరిగింది అని చాలామంది వైయస్ జగన్ కు సన్నిహితంగా ఉండే నాయకులు అంటుంటారు. కానీ ఆ ఎన్నికలలో విజయమ్మ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ కేంద్రంగా అనేక రాజకీయ పరిణామాలు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో చోటుచేసుకున్నాయి.

 

వైజాగ్ ని రాజధాని చేయాలి అని ముందు నుంచి తన మనసులో ఉండటంతో తాను నమ్మిన బంటు విజయసాయి రెడ్డికి ఆ ప్రాంత బాధ్యతలను అప్ప చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పై పోరాడుతూ పాదయాత్ర చేస్తూ ఉన్న సమయంలో వైజాగ్ కేంద్రంగా విమానాశ్రయంలో కోడి కత్తి ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అయినా గాని పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున చేసి విజయం సాధించిన వైయస్ జగన్ మొదటి ఏడాదిలోనే మూడు రాజధానులు కాన్సెప్ట్ తెర పైకి తీసుకు వచ్చి వైజాగ్ ని రాజధానిగా గుర్తించడం జరిగింది. అభివృద్ధి చెందిన పట్టణం పైగా సముద్రతీర ప్రాంతం కావడంతో కేవలం 10 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం రాజధానికి సంబంధించిన లుక్ ఏర్పడుతుందని మొదటిలో భావించారు.

 

దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయటానికి రెడీ అయ్యారు. ఈ లోపు కరోనా వైరస్ రావడంతో ప్రస్తుతం పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలే విభజనతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం పైగా తాను అధికారంలోకి వచ్చాక నిండా అప్పులు ఉండటం తరువాత కరోనా సంక్షోభానికి అసలు ఆదాయం లేకపోవడంతో వైజాగ్ రాజధానిగా ఏర్పాటు చేయడానికి పనులు స్టార్ట్ చేయడానికి జగన్ ప్రజెంట్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని...ఇంకా కొద్ది కాలమే మిగిలి ఉండటంతో...వైజాగ్ రాజధానిగా చేయాల్సిన పనుల విషయంలో జగన్ కి గుబులు మొదలైనట్లు వైసీపీ పార్టీలో టాక్. సో ఇప్పుడున్న ఆర్థిక లెక్కల బట్టి చూస్తే వైజాగ్ లో రాజధాని కోసం నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని వైసిపి పార్టీ లో టాక్ నడుస్తుంది. మొత్తమ్మీద జగన్ మొదటి టర్మ్ లో అమరావతి కేంద్రంగానే పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక రెండో సారి గెలిస్తే ఏమైనా పని జరగచేమో గాని… మొదటి టర్మ్ లో రాజధానిగా వైజాగ్ నుండి పరిపాలన మాత్రం సాధ్యం కాదని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: