ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించారు పితాని సత్యనారాయణ. వైయస్ హయాంలో మంత్రిగా పని చేసిన పితాని ఆయన చనిపోయాక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2014 ఎన్నికలలో ఆచంట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పితాని చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ESI స్కామ్ లో అచ్చెన్నాయుడు ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ఓ ప్రశ్నకు అచ్చం నాయుడు ఇచ్చిన సమాధానం మాజీ మినిస్టర్ పితాని సత్యనారాయణ మెడకు చుట్టుకుంది అని వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి విషయంలోకి వెళ్తే ఆంధ్ర సచివాలయం హైదరాబాద్‌ లో ఉన్న సమయంలో మూడు సిఫారసు లేఖలు, అమరావతికి వచ్చిన తర్వాత మరో రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న ఇచ్చారని ఈఎస్ ఐ అధికారులు వెల్లడించారంట. ఈ క్రమంలో ఈ ప్రశ్నకు అచ్చెన్న సమాధానం…” అన్ని ప్రభుత్వ విభాగాల్లో లేఖలనేవి సర్వసాధారణ విషయం”. అని అనంతరం స్పందించిన అచ్చెన్న..”టెలీహెల్త్‌కు సంబంధించి కొనుగోళ్లు జరిగిన సమయంలో నేను కార్మిక శాఖ మంత్రిగా లేను” అని సమాధానం ఇచ్చారట.

 

దీంతో ఆ సమయంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసింది పితాని సత్యనారాయణ అని… దీంతో ఏసీబీ అధికారులు నెక్స్ట్ అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్ లో  కేటాయించిన దానికంటే అదనంగా కార్మిక శాఖ లో పితాని ఆధ్వర్యంలో రూ. 34.05 కోట్లను ఖర్చు చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో అచ్చెన్నాయుడు ఇచ్చిన సమాధానం బట్టి నెక్స్ట్ పితాని సత్యనారాయణ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశమున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: