కర్ణాటక లో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఇక నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు నమోదైన కేసులో నేడే అత్యధికంగా 918 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నాటకలో ఫాస్ట్ కేసుల సంఖ్య 11, 923 చేరుకుంది. మరోవైపు గడచిన 24 గంటల్లో 371 మంది కరుణ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7287 కు చేరుకుంది. ఈ వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేసింది. 

 


ఇక నేను ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరుణ బారినపడి మృతి చెందారు దీంతో రాష్ట్రం మొత్తంగా నేటి వరకు 191 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4441 కరుణ కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 197 మందికి వారి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 

 

 

ఇక అలాగే రాష్ట్రంలో జులై 5 నుంచి ప్రతి ఆదివారం అత్యవసరమైన సర్వీసులు తప్పించి మిగతా అన్నిటినీ మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కొత్త రూల్ రావడం జరిగింది. అలాగే జూలై 10 నుండి ప్రభుత్వ ఆఫీసులు అన్ని కూడా ప్రతి శనివారం మూసి వేస్తారని తెలియజేశారు. అలాగే బెంగళూరు నగరంలో కర్ఫ్యూ సమయాన్ని కూడా రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉన్న సమయాన్ని, రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఈ సమయాలు ఈ నెల 29 నుండి అమల్లోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: