ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో వైరస్ సోకి 11 మంది చనిపోయారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్ర వాసులు 740 మంది కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

 

శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 వేల458 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 796 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 వేల 285కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 263 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 11 మంది  మృతి చెందారు. మృతి చెందిన 11 మందిలో కర్నూలు 4, కృష్ణా 4, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 వేల 648 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5 వేల 480కి చేరింది. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. కృష్ణాజిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సర్కారు సూచిస్తోంది. మొత్తానికి కరోనా ఏపీలో ఉగ్రరూపం చూపిస్తోంది. ఎంతో మందిని ఆస్పత్రిపాలు చేసిన ఈ మహమ్మారి.. కొందరి ప్రాణాలను హరించేస్తోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ విధంగా కరోనా మహమ్మారి తమను ఎటాక్ చేస్తుందో అనే ఆందోళన వారిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: