నరసాపురం వైసీపీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో రోజురోజుకీ అంతకంతకు పెరిగిపోతోంది. వైసీపీ పార్టీ అధిష్టానంతో నువ్వానేనా అన్నట్టుగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి ఉంది. మీడియా ముందే ప్రభుత్వ నిర్ణయాలపై మరియు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేస్తూ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధిష్టానం సీరియస్ అయి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన రఘురామకృష్ణంరాజు వైసిపి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తనని పార్లమెంటు సభ్యత్వం నుండి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని రఘురామ కృష్ణంరాజు అధిష్టానంపై మండిపడుతున్నారు.

 

షోకాజ్ నోటీసులు స్వయంగా ప్రభుత్వానికి వివరణాత్మకంగా ఇవ్వలేకపోతే లెటర్ రూపంలో ఇవ్వాలా అన్న దాని విషయంలో తన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇదిలా ఉండగా కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదని ఆయన చుట్టూ కోటరీ ఉందని రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

 

ఎందుకంటే ప్రస్తుతం రోజుకి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతో ఎంపీలతో జగన్ భేటీ అయి వారి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు అట. దీంతో ఈ విషయంలో జగన్ మీద రఘురామకృష్ణంరాజు గెలిచారని, ఆయన వల్ల పార్టీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు జగన్ అపాయింట్మెంట్ దొరికింది అని కొంతమంది అంటున్నారు. మరోపక్క షోకాజ్ విషయంలో ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజు కేంద్ర పెద్దలతో భేటీ అవ్వడం ఆ తర్వాత ఆయన మీడియా తో మాట్లాడిన తీరు చూస్తే కొంచెం దూకుడు తగ్గించినట్లు అర్ధమవుతోంది. కానీ రాజు గారి వ్యాఖ్యలకు ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు జగన్ దగ్గర అపాయింట్మెంట్లు దొరకడంతో చాలామంది తమ నియోజకవర్గంలో సమస్యలను సీఎం తో చెప్పుకున్నే అవకాశం దక్కటం పార్టీ లో హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: