ఎన్నో ఏళ్ల నుంచి నేపాల్ భారత్ మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం తెలిసిందే. సంస్కృతి సాంప్రదాయ విషయంలోనూ నేపాల్ భారత్ ఒకటి అన్నట్లుగా ముందుకు సాగాయి. అంతేకాకుండా నేపాల్ కు చెందిన వాళ్ళు భారతీయులను పెళ్లి చేసుకోవడం..  భారత్ కు చెందిన వాళ్ళు నేపాలిలను  పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగేవి. నేపాలీలని  పెళ్లి చేసుకోవడం కారణంగా ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వం వచ్చేది. అయితే మొన్నటి వరకు భారత్కు మిత్ర దేశంగా..ఎంతో సన్నిహితంగా ఉన్న నేపాల్ ప్రస్తుతం భారత్కు వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. 

 

 చైనా తో చేతులు కలిపి భారత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం  వివాదాలకు తెర లేపడం లాంటివి చేస్తుంది ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల పాటు కొనసాగుతూ వస్తున్న బంధాలను బ్రేక్ వేసే విధంగా తాజాగా నేపాల్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఒకవేళ భారత్కు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటే వారికి నేపాల్  పౌరసత్వం ఇవ్వకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది, 

 

 అయితే ఇది నిజంగా ఒక సంచాలణాత్మకమయినటువంటి నిర్ణయమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే రామాయణ కాలం నుంచి నేపాల్ భారత్ మధ్య ఎంతో సన్నిహిత్య సంబంధం ఉందని.. అప్పటి నుంచే ఎంతో మంది ఇరు దేశాలకు సంబంధించిన వారు వివా హాలు చేసుకున్న సాంప్రదాయం కూడా కొనసాగు తుందని... వివాహం చేసుకోగానే  నేపాల్ పౌరసత్వం లభిస్తుంది కానీ ప్రస్తుతం చైనా ప్రేరేపిత నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కారణంగా భారత్- నేపాల్  మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని అంతేకాకుండా భారత్  నేపాల్ వేరు అని చెప్పేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు అక్కడి ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: